పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన | Sakshi
Sakshi News home page

పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన

Published Tue, Feb 18 2014 2:17 AM

polling stations  public services

 శ్రీకాకుళం, న్యూస్‌లైన్, :పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు ఉండేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఆధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలు, సౌకర్యాలపై సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు వంటి కనీస వసతులు ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ అధికారుల స్థానాలు ఖాళీగా ఉంటే వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ప్రక్రియ తొలుత శిక్షణలతో ప్రారంభం కావాలని, ప్రతి అంశాన్ని వీడియో తీయాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ త్వరలో రానున్నందున ఎన్నికల నియమావళి పరిశీలినకు సంబంధించిన ఆధికారులను నియమించేం దుకు చర్యలు చేపట్టాలన్నారు.
 
 ఎన్నికల నియమావళిలో ఉన్న ప్రతి ఆంశాలను వధిగా పాటించాలని, అందుకోసం ఆధికారులతో కమిటీలు వేయాలన్నారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ జిల్లాలో ఇచ్ఛాపురం, నరసన్నపేట, పలాస నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు భర్తీకావాల్సి ఉందని భన్వర్‌లాల్‌కు వివరించారు. జిల్లాకు ఐదు వేలు కొత్త ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చాయని, మరో వెయ్యి అవసరమన్నారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమయ్యే ఏర్పాట్లను చేపడతామన్నారు. ఆనధికార మ ద్యం దుకాణాలను పూర్తిగా నియంత్రించేం దు కు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎస్పీ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ భద్రతా పరంగా అ న్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ వీరపాండియన్, ఏజేసీ ఎండీ షరీప్, డీఆర్‌ఓ నూరుబాషా కాశీం, ఆర్‌డీవోలు జి.గణేష్‌కుమార్, తేజ్‌భరత్, ఎం.వెంటేశ్వరరావు, సీపీఓ ఎం.శివరాం నాయకర్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement