ఉత్తమ సీరియల్గా 'కొంచెం ఇష్టం కొంచె కష్టం' | Sakshi
Sakshi News home page

ఉత్తమ సీరియల్గా 'కొంచెం ఇష్టం కొంచె కష్టం'

Published Sat, May 16 2015 10:57 PM

Popular TV serial of the year koncham istam koncham kastam

హైదరాబాద్: ఈ ఏడాది ఉత్తమ టీవీ సీరియల్గా 'కొంచెం ఇష్టం కొంచె కష్టం'  సాక్షి ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైంది. శనివారం రాత్రి జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ సిరీయల్ను ఉత్తమ టీవీ సీరియల్గా ఎంపిక చేశారు. అయితే వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు సాక్షి మీడియా ఈ ఏడాది నుంచి సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు అందజేస్తోంది.  

ఈ కార్యక్రమంలో సాక్షి గ్రూపు చైర్మన్ వైఎస్ భారతీ రెడ్డి, ఈడీ రామచంద్ర మూర్తి, ప్రముఖ కవి సి.నారాయణ రెడ్డి,  ఇండియా టుడే గ్రూపు వైస్ చైర్మన్ శేఖర్ గుప్తా, ఏబీకే ప్రసాద్, పోసాని కృష్ణమురళి, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement