విద్యుత్ భారం తప్పదా | Sakshi
Sakshi News home page

విద్యుత్ భారం తప్పదా

Published Wed, Mar 2 2016 12:04 AM

power shock in srikakaulam

 శ్రీకాకుళం పాతబస్టాండ్ : ని విద్యుత్ బిల్లులు పెంపుదలకు విద్యుత్ శాఖ రంగం సిద్ధం చేసింది. వినియోగదారులపై రూ.2కోట్ల వరకు భారం పడనుందని అంచనా. పెరిగిన చార్జీలు ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయి. విద్యుత్ చార్జీల టారిఫ్ పెంపుపై డిస్కంలు ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్‌సీ ఆమోదం మేరకు చార్జీల పెంపు అమలు కానుంది. జిల్లాలో గృహ, వాణిజ్య, చిన్న తరహా, కుటీర పరిశ్రమలకు సంబంధించి  6,98,707 సర్వీసులు ఉన్నాయి. భారీ పరిశ్రమలకు 250 కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 3 నుంచి 3.5 లక్షల యూనిట్లు ఖర్చవుతోంది. నెలకు విద్యుత్ బిల్లుల రూపేణా రూ. 46 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.
 
 వేసవిలో రూ.50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది.  నియంత్రణ మండలికి ప్రభుత్వం 7.5 శాతం చార్జీల పెంపునకు నివేదిక  అందజేసింది. దీని ప్రకారం సగటున నెలకు రూ.2 కోట్లు వరకు పెరిగే అవ కాశం ఉంది. తాజా ప్రతిపాదిత రేట్ల ప్రకారం 300 యూనిట్లు పైబడినవారిపైన మాత్రమే భారం పడుతుందని చెబుతున్నారు.  50 యూనిట్ల లోపు వినియోగం ఉన్న వారిపైన భారం పడే అవకాశాలు లేవు. నెలలో 100 నుంచి 200, రెండు వందల నుంచి మూడు వందల యూనిట్లను వినియోంచే వారు ఉన్నారు.
 
 ప్రతిపాదనల్లో మాత్రం 300 యూనిట్లు పైబడి వినియోగించిన వారి శ్లాబు రేటు పెరుగుతుందని  చెబుతున్నారు.ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమావేశం బుధవారం శ్రీకాకుళం ఎపీఈపీడిసిఎల్ సర్కిల్ కార్యాలయంలో జరగనుంది.  విశాఖపట్నంల 3న ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. సర్కిల్ ఇంజనీర్లుతో పాటు కంపెనీ డైకర్టర్లు కూడా హజరుకానున్నారు. ఇదంతా నామమాత్రమేనని వినియోగదారులంటున్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement