రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తాం | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తాం

Published Mon, Dec 1 2014 2:17 AM

రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తాం - Sakshi

  • బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ
  • సాక్షి, విజయవాడ బ్యూరో: త్వరలో జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, వచ్చేసారి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తమ సర్కార్లు వస్తాయని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ చెప్పారు. తాము కోరిన సీట్లు శివసేన ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కిం చుకున్నామని తెలిపారు.

    ఆదివారం విజయవాడ శివారు పోరంకిలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రూఢీ మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పట్ల తమకు అమితమైన గౌరవం ఉందని, అంతమాత్రాన ఆ రాష్ట్రాల్లో తమ పార్టీ బలపడడం ఆగద న్నారు. ఏపీలో ఈ సంవత్సరం పది లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని, ఐదేళ్లలో ఆ సంఖ్య 80 లక్షలకు చేరాలని సూచించారు.
     
    పార్టీ అంటే జీవిత భాగస్వామి: వెంకయ్య

    వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తుళ్లూరులో పచ్చగా కనిపించే పొలాలు పోతున్నాయంటే బాధగానే ఉంటుందని, కానీ రాజధాని కోసం తప్పదని చెప్పారు.  బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా పార్టీలోకి రావచ్చని చెప్పిన వెంకయ్య.. పదవుల కోసం వచ్చే వారిని మాత్రం తాను ఆహ్వానించనని స్పష్టం చేశారు.
     
    ఈ సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబుకు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ సభ్యత్వం ఇవ్వగా మంత్రు లు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులకు హరిబాబు సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగ ర మాజీ అధ్యక్షుడు అడపా నాగేంద్ర సహా రాష్ట్రంలోని పలువురు నేతలు బీజేపీలో చేరారు.
     

Advertisement
Advertisement