మోదీని కూడా వ్యతిరేకించా: ప్రహ్లాద్ మోదీ | Sakshi
Sakshi News home page

మోదీని కూడా వ్యతిరేకించా: ప్రహ్లాద్ మోదీ

Published Sat, May 30 2015 1:02 AM

మోదీని కూడా వ్యతిరేకించా: ప్రహ్లాద్ మోదీ - Sakshi

కర్నూలు: ప్రజాసంక్షేమంలో భాగస్వాములైన రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలదీద్దామని చౌక డిపో దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, ప్రధాని సోదరుడు ప్రహ్లాద మోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ చౌక ధరల దుకాణాదారుల సంఘాల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే చౌక డిపో డీలర్లతో తప్పుడు పనులు చేయిస్తోందన్నారు.

గుజరాత్ రాష్ట్రంలో ప్రతి డీలర్‌కు రూ. 15 వేల వరకు కమిషన్ వస్తుందన్నారు. రేషన్ డీలర్లకు అనుకూలంగా గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్రమోదీని కూడా వ్యతిరేకించానన్నారు. డీలర్లంతా కలసికట్టుగా పోరాడినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎల్‌పీజీ డీలర్లు కోట్లు సంపాదిస్తుంటే.. రేషన్ డీలర్లు రోడ్డు పడే పరిస్థితి రావడం శోచనీయమన్నారు.

Advertisement
Advertisement