ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది

Published Wed, Aug 8 2018 10:55 AM

Praja Sankalpa Yatra Enter Into Vizag At August 14 - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో నిలిచి పోతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఈ నెల 14న విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం మెట్టు వద్ద రాజన్న తనయుడు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో నిలిచి పోతుందని, అన్ని వర్గాల ప్రజలు వాళ్ల కష్టాల్ని ప్రతిపక్షనేతకు చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలోని 102 నియోజకవర్గాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేశారని, ప్రతి నియోజకవర్గంలోనూ ఒక నిర్ధిష్టమైన ప్రకటన చేస్తున్నారని చెప్పారు. విశాఖ జిల్లా ప్రజలు కూడా జననేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు మద్దతు తెలపాలని అమర్‌నాథ్‌ పిలుపునిచ్చారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు (లోక్‌సభ) 14 నెలల పదవీ కాలాన్ని త్యాగం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీ హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతునే ఉంటుందన్నారు. విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో 210 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని, 7 బహిరంగ సభల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారని.. 25 రోజుల పాటు జిల్లాలో పర్యటన ఉంటుందని వెల్లడించారు. గిరిజన సమస్యలపై  వైఎస్‌ జగన్‌ స్పష్టమైన ప్రకటన చేస్తారని, రైల్వేజోన్‌ అంశాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్తామని గుడివాడ అమర్‌నాథ్‌ వివరించారు.

Advertisement
Advertisement