ప్రజాసంకల్పయాత్ర 182వ రోజు షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 5 2018 9:08 PM

Prajasankalpayatra 182th Day Scheduele Released - Sakshi

సాక్షి, తణుకు (పశ్చిమ గోదావరి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాదయాత్ర నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఉండ్రాజవరం మండలం పాలింగీ, ఉండ్రాజవరం మీదుగా చిలకపాడు క్రాస్‌ రోడ్డు చేరుకున్న తర్వాత వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి మోర్తా, దమ్మెన్ను మీదుగా నడిపల్లి కోట చేరుకున్న తర్వాత పాదయాత్ర ముగుస్తోంది. జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు.

ముగిసిన 181వ రోజు పాదయాత్ర  
వైఎస్‌ జగన్‌ 181వ రోజు పాదయాత్ర తణుకులో ముగిసింది. నేడు ఆయన యర్రాయిచెరువు శివారు నుంచి వెల్పూరు మీదుగా తణుకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ చెప్పిన అవునండీ.. చంద్రబాబు కథకు ప్రజలు ముగ్ధులయ్యారు. ఆయన పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

Advertisement
Advertisement