కారు ఢీకొనడంతో గర్భిణీకి తీవ్ర గాయాలు | Sakshi
Sakshi News home page

కారు ఢీకొనడంతో గర్భిణీకి తీవ్ర గాయాలు

Published Thu, May 14 2015 7:56 PM

Pregnant woman injured in Road accident

హైదరాబాద్ (లంగర్ హౌస్) : నిర్లక్ష్యంగా కారు నడపడంతో తొమ్మది నెలల నిండు గర్భిణీతోపాటు 17 నెలల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... సీతారాంబాగ్‌లో నివాసముండే జె.మహేష్‌బాబు గురువారం నార్సింగిలోని బంధువుల వివాహానికి హాజరై భార్య, కుమారుడితో బైక్పై వస్తుండగా మారుతీ నగర్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 నెలల గర్భిణి అయిన మహేశ్ భార్య , 17 నెలల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఓ కారును ఓవర్ టేక్ చేయడానికి మరో కారు డ్రైవర్ ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement