రైలు ఎక్కాలంటే ప్రీమియం కట్టాల్సిందే! | Sakshi
Sakshi News home page

రైలు ఎక్కాలంటే ప్రీమియం కట్టాల్సిందే!

Published Thu, Nov 24 2016 2:52 AM

రైలు ఎక్కాలంటే ప్రీమియం కట్టాల్సిందే!

త్వరలో రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటన  
సాక్షి, అమరావతి: రైలు ప్రయాణం చేయాలంటే ఇకపై తప్పనిసరిగా బీమా చెల్లించాల్సిందే. యూపీలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్ తీసుకుంటే 92 పైసల్ని బీమా రూపంలో కట్టించుకుని జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐఆర్‌సీటీసీ కల్పిస్తున్న ఆన్‌లైన్ రిజర్వేషన్ విధానంలో జారీ చేసే టికెట్లకు మాత్రం బీమా చెల్లింపునకు ఆప్షన్ విధానం కల్పించారు. ఈ ఆప్షన్ విధానాన్ని తొలగించి బీమా చెల్లింపును తప్పనిసరి చేస్తూ ఆన్‌లైన్ రిజర్వేషన్ విధానానికి సవరణలు చేయనున్నారు. దీనిపై రైల్వే మంత్రిత్వశాఖ త్వరలో ప్రకటన చేయనుంది.

ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వారి లో 823 మందికి 695 మంది ఆన్‌లైన్‌లో టికెట్లను రిజర్వేషన్ చేయించుకున్నారు. 128 మంది రైలు ప్రయాణ బీమా పొందారు. ఈ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదంలో మృతులసంఖ్య 150కి చేరిన విషయం తెలిసిందే. రైలు ప్రయాణ బీమా పొందిన వారికి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే రూ.10 లక్షలు, ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షలు, గాయాలైతే రూ.10 వేలు, రైలు ప్రయాణంలో సామాగ్రి పోగొట్టు కుంటే రూ.5 వేలు పరిహారంగా అందుతాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement