అరకొరగా నిధులు | Sakshi
Sakshi News home page

అరకొరగా నిధులు

Published Mon, Mar 9 2015 12:30 AM

Preparations begin for Godavari Pushkaralu

ఇంకా టెండర్ల దశలోనే పలు పనులు
     చాలావరకూ మరమ్మతులతో సరి!
     రామచంద్రపురం నియోజకవర్గంలో ఘాట్ల పరిస్థితి
 రామచంద్రపురం : గోదావరి పుష్కరాల సందర్భంగా కె.గంగవరం మండలం కోటిపల్లిలోని గౌతమీ గోదావరిలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ కొలువుదీరిన శ్రీ ఛాయా సోమేశ్వరుని దర్శించుకుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంలోని స్నానఘట్టాల అభివృద్ధి గురించి ప్రభుత్వం అంతగా పట్టించుకోవడంలేదు. పుష్కరాల సందర్భంగా కోటిపల్లి నుంచి బ్రహ్మపురి వర కూ సుమారు 21 కిలోమీటర్ల మేర ఉన్న గోదావరి తీరంలో అధిక సంఖ్యలో భక్తు లు పుణ్యస్నానాలు చేస్తారు. మొత్తం నియోజకవర్గంలో 12 స్నానఘట్టాలకుగా నూ ఒకదాని పనులే ప్రారంభమయ్యా యి. ఆయా స్నానఘట్టాల అభివృద్ధికి రూ.3.60 కోట్లు,  కాజులూరు మండలం లో తొగరపాయ తీరంలో రెండు ఘాట్ల అభివృద్ధికి రూ.42 లక్షలు మంజూరయ్యాయి.
 
 కోటిపల్లిలో ఇప్పటికే ఒక స్నానఘట్టం ఉండగా మరో రెండు నిర్మిం చేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ మూడింటికీ రూ.1.20 కోట్లు మంజూరవగా, టెండర్ల దశను పూ ర్తి చేసుకుని ఇటీవల పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న రేవును పెంచు తూ శ్మశానవాటిక వరకూ స్నానఘట్టాల నిర్మాణం చేపడుతున్నారు. కూళ్ల మల్లవరం, సుందరపల్లి, దంగేరు, కోట, మసకపల్లి, బ్రహ్మపురి రేవులకు నిధులు కేటాయించినా ఇప్పటివరకూ ఇంకా టెండర్ల దశ పూర్తి కాలేదు. వీటికి మరమ్మతులు మాత్రమే చేయనున్నారు. ఈ పనులు పుష్కరాల నాటికి పూర్తవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 గోదావరి తీరాన్ని ఆనుకుని దంగేరు రామఘట్టాల వద్ద స్నానాల రేవును కూడా మరమ్మతులకు మాత్రమే పరిమి తం చేశారు. కోటిపల్లి తరువాత అత్యధికంగా ఇక్కడే భక్తులు పుష్కరాలకు పుణ్యస్నానాలు చేస్తారు. కోటిపల్లి మినహా నియోజకవర్గంలో గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న మిగిలిన స్నానఘట్టాలవద్ద ఎటువంటి పనులూ ప్రారంభించలేదు. మొత్తమ్మీద నియోజకవర్గంలోని పనులు ఆలస్యం కావడంతో వచ్చిన అరకొర నిధులతో పనుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం కోటిపల్లి స్నానఘట్టాల అభివృద్ధి పనులు మొదలయ్యాయని, మిగిలినవి టెండర్ల దశలో ఉన్నాయని కన్జర్వేటర్ ఏఈ కె.ఈశ్వరమణ్యం ‘సాక్షి’కి చెప్పారు. నియోజకవర్గంలోని 12 స్నానఘట్టాలకు సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
 

Advertisement
Advertisement