వైద్య విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి

Published Mon, Jun 8 2015 4:06 AM

వైద్య విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి - Sakshi

ఆత్మనూన్యతా భావం
క్రీడలకు దూరం
పర్యవేక్షణ లేమి

 
 అనంతపురం మెడికల్ :  వైద్య కళాశాల లోని విద్యార్థులు అభద్రతాభావంలో ఉన్నారు. పలువురు విద్యార్థులు స్వేచ్చ లేదంటూ బహిరంగంగా ఈ నెల 5న నిర్వహించిన వైద్య విద్యార్థిని స్వర్ణకుమారి సంతాప సభలో చెప్పారు. కళాశాల, హాస్టల్, లైబ్రరీకే పరిమితమవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.   వైద్య కళాశాలలో కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నడుస్తోంది. విద్యార్థులకు వి హారయాత్రను రద్దు చేశారు. దీంతో పా టు  ఫిజికల్ డెరైక్టర్ అందుబాటులో ఉన్నా క్రీడల నిర్వహణ లేదు. క్రీడల కోసం ప్రత్యేకంగా ఓ పీరియడ్‌ను కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.

వైద్య విద్యనభ్యసించే వారు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. దీని నుంచి వారు ఉపశమనం పొందేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయి. ఈ విషయాన్ని యా జమాన్యం పట్టించుకోవడం లేదు. క్రీడా పోటీల్లో పాల్గొంటే మానసికోల్లాసంతోపాటు క్రీడాస్ఫూర్తి అలవడి, జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఏర్పడుతుందని సీనియర్ వైద్యు లు చెబుతున్నారు.

 పర్యవేక్షణ లేమి..
 హాస్టళ్లలో వైద్య విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేదని తెలుస్తోంది. విద్యార్థులు అందరూ కళాశాలకు వెళ్లారా లేక గదుల్లోనే ఉన్నారా? అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని సమాచారం. అ నారోగ్యానికి గురైన సందర్భంలో వి ద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుం ది. విద్యార్థుల ఆరోగ్యంపై యాజమాన్యానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. కానీ హాస్టల్‌లో  అటెండెన్స్ తూతూ మంత్రంగా వే స్తున్నారని, తన వద్దకే వచ్చి అటెండెన్స్ తీసుకోవాలని హౌస్ కీపర్ చెబుతున్నార ని విద్యార్థులు అంటున్నారు.  ప్రభుత్వ వైద్య కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఏమాత్రం పర్యవేక్షణ ఉంచిందన్న విషయాన్ని విద్యార్థిని స్వర్ణకుమారి ఆత్మహత్య స్పష్టం చేస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement