ప్రైవేటు పాఠశాలల సమస్యలపై వినతి | Sakshi
Sakshi News home page

ప్రైవేటు పాఠశాలల సమస్యలపై వినతి

Published Mon, Dec 3 2018 7:32 AM

Private School Management meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటు న్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ సంఘం(అపుస్మా) రాష్ట్ర ప్రతినిధులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా ఆదివారం జిల్లాలోని రాజాం నియోజకవర్గం రేగిడి మండలం చిన్నశిర్లాం వద్ద ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ప్రతిపక్షనేతను అపుస్మా ప్రతినిధులు కలసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అపుస్మా కడప జిల్లా అధ్యక్ష, ప్రధా న కార్యదర్శి ఎంవీ రామచంద్రారెడ్డి, బి.గంగ య్య, అపుస్మా గుంటూరు జిల్లా అధ్యక్షుడు పోతిరెడ్డి, సంఘ వైజాగ్‌ జిల్లా అధ్యక్షుడు ఎంవి రావు తదితరులు కలసి మాట్లాడుతూ నవరత్నాల్లో ఒక పథకమైన అమ్మ ఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేటు పాఠశాలల్లో కూ డా వర్తింపజేయాలని, కరెంట్‌ కేటగిరి 2 నుంచి కేటగిరి 7కు మార్చాలని, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గృహాలు, ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని, ఆస్పత్రికి వర్తించే చట్టం ప్రైవేటు స్కూల్స్‌కు కూడా వర్తింపజేయాలని కోరారు. ట్రిపుల్‌ ఐటీలో సీట్లు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నారని, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను కూడా అనుమతించా లని కోరారు. జగన్‌ను కలసిన వారిలో సంఘ ప్రతినిధులు బి.గంగయ్య, పాటూరి వెంకటేశ్వరరావు, ఎం.నరసింహమూర్తి, పి. శ్రీకాంత్, బి.లక్ష్మణరావు, ఆర్‌.అప్పన్న తదితరులు ఉన్నారు.

సమస్యలపై వినతి
రేగిడి: రజకుల సమస్యలు పరి ష్కరించాలని ఆ సంఘ నాయకులు ఆదివారం మండల పరిధిలో ని చిన్నశిర్లాం వద్ద జరిగిన ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. 50 ఏళ్లు నిండిన రజకులకు రూ. 2వేలు పింఛన్‌ ఇవ్వాలని, రజకులకు రక్షణ చట్టం కల్పించాలని, తెలంగాణ ప్రభుత్వం చేసిన విధంగా బ్యాంకు లింకేజీ లేకుండా రూ. లక్షకు 80 శాతం, రూ. 2 లక్షలకు 70 శాతం రాయితీపై రుణాలు ఇవ్వాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. దోబీ ఘాట్స్‌ నిర్మాణాలను నామినేషన్‌ కింద రజక సొసైటీలకు అప్పగించాలని కోరారు. రజకులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏకరువు పెట్టారు. వినతిపత్రం అందించిన వారిలో రజక సంఘం నాయకులు పన్నీటి కారయ్య, జె.లక్ష్మణరావు, ఎ.సింహాచలం, వీరాస్వామి ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement