కౌలు బాట.. కష్టాల మేట! | Sakshi
Sakshi News home page

కౌలు బాట.. కష్టాల మేట!

Published Mon, Jul 28 2014 3:53 AM

కౌలు బాట.. కష్టాల మేట! - Sakshi

రుణాలు అందక కౌలు రైతు దిగాలు
 
    సర్కారు ఆదుకోదు.. బ్యాంకులకు పట్టదు
►    ఈ ఏడాది రుణ అర్హత కార్డులు ఇవ్వలేదు
    కనీసం పాతవి కూడా పునరుద్ధరించలేదు
    అధీకృత సాగుదార్ల చట్టానికి దిక్కులేదు..\
    హామీ లేకుండా రూ.50 వేల రుణం ఇచ్చే అవకాశం ఉన్నా ఎగ్గొడుతున్న బ్యాంకులు
►    పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఒత్తిడి
►    వడ్డీ వ్యాపారులనే ఆశ్రరుుస్తున్న నిరుపేదలు


ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సెంటు భూమి లేనివారు    -   30% .
భూమి ఉన్నా.. సాగు చేయకుండా కౌలుకు  ఇస్తున్నవారు    -   40%
(హెక్టారు)సుమారు రెండున్నర ఎకరాలలోపే ఉన్నవారు        -  30%
రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య                                         -  25,00,000
 
 
 హైదరాబాద్
 కరువు కాటేస్తున్నా, తుపాన్లు పంటను మింగేస్తున్నా సాగే జీవనాధారంగా బతుకులీడ్చే కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్‌లో కనీస పెట్టుబడులు లేకపోవడంతో వారు పంటలు వేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అచ్చంగా భూమినే నమ్ముకున్న ఈ కౌలు రైతుల కోసం ప్రభుత్వం మూడేళ్ల కిందట ఓ చట్టం తెచ్చినా వారికి ఏవైపు నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి రుణ అర్హత కార్డులూ జారీ చేయని ప్రభుత్వం, పాత కార్డులను కూడా పునరుద్ధరించలేదు. దీంతో కీలక సమయంలో పెట్టుబడికి అవసరమైన రుణాలు లభించక కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనధికార అంచనా ప్రకారం.. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 లక్షల మంది కౌలు రైతులున్నారు. సాగు చేసుకోవడం మినహా ఆయూభూములపై  ఎటువంటి హక్కుభుక్తాలు లేని కౌలుదారుల దుస్థితిని గుర్తించి 2011లో ఆనాటి ప్రభుత్వం అధీకృత సాగుదార్ల చట్టం తీసుకువచ్చింది. వాస్తవ కౌలుదారులను గుర్తించి వారిని ఆదుకునేందుకు రుణాల మంజూరు వంటి చర్యలు చేపట్టడం దీని ప్రధానోద్దేశం. ఈ మేరకు వాస్తవ కౌలుదారులను గుర్తించే ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా కౌలుదారులు ఉన్నట్టు అంచనా వేసింది. అయితే ఈ సంఖ్యపై రైతు సంఘాలు, వివిధ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారుు. ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షలకు పైగా కౌలుదారులున్నారని గణాంకాలతో సహా వివరించాయి. ఈ నేపథ్యంలో కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. వీటితో పాటు రుణ అర్హత కార్డులు (ఎల్‌ఈసీలు) కూడా ఇవ్వడం ప్రారంభించింది. 2011లో 5,76,147 మందికి కార్డులిచ్చి 1,97,725 మందికి రూ.393.45 కోట్ల మేరకు రుణాలు లభించేలా చూసింది. 2012లో 2,44,082 మంది కార్డులను పునరుద్ధరించడంతో పాటు మరో 1,79,082 మందికి కొత్త కార్డులు ఇచ్చింది. వీరిలో 1,31,975 మందికి రూ.312 కోట్ల రుణాలు మంజూరయ్యూరుు. ఇక 2013-14 ఆర్ధిక సంవత్సరంలో పాతకార్డుల్లో 2,79,673 మంది కార్డులను పునరుద్ధరించి 1,66,462 మందికి కొత్తగా కార్డులు ఇచ్చింది. ఆ సంవత్సరంలో వారికి రూ.330.51 కోట్ల మేరకు రుణం మంజూరరుు్యంది. అరుుతే రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొత్త కార్డులు ఇవ్వలేదు. పాత వాటిని పునరుద్ధరించలేదు. జూలైలో గ్రామసభలు పెట్టి కౌలు రైతులకు కార్డులిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు.

రూ.1,000 కోట్లతో ప్రత్యేక నిధికి డిమాండ్

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 30 శాతం మందికి సెంటు భూమి కూడా లేదు. మరో 30 శాతం మందికి హెక్టార్ (సుమారు రెండున్నర ఎకరాలు) లోపే ఉంది. మిగతా 40 శాతం మందికి ఎక్కువ భూమి ఉన్నా వాళ్లు సాగు చేయకుండా కౌలుకు ఇస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని మొత్తం 46 లక్షల హెక్టార్ల సాగుభూమిలో 80 శాతం కౌలుదారులపైనే ఆధారపడి ఉంది. వీరి కోసం తెచ్చిన అధీకృత చట్టం ఆచరణలో ఎందుకూ కొరగాకుండా ఉంది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతుకు ఎటువంటి హామీ లేకుండా రూ.50 వేల రుణం ఇచ్చే అవకాశం ఉన్నా బ్యాంకులు ఇవ్వడం లేదు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో కౌలు రైతులకు బ్యాంకుల్లో అప్పు పుట్టడం లేదు. గుర్తింపు, రుణ అర్హత కార్డులున్నా ఫలితం లేకుండా ఉంది. భూ యజమానుల నుంచి పాస్ పుస్తకాలు తెచ్చుకుంటేనే రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడుల కోసం వీరు అనివార్యంగా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సింది వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఇంతవరకు ఎల్‌ఈసీలు పునరుద్ధరించడం కానీ, కొత్త కార్డులు ఇవ్వడం కానీ జరగకపోవడంతో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ సైతం సదరు భూమిపై యజమాని రుణం తీసుకోని పక్షంలో మాత్రమే కౌలుదారులకు వర్తించనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అధీకృత చట్టాన్ని మార్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కౌలు రైతుల కోసం వేయి కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నాయి. వేర్వేరు కారణాలతో భూస్వాములు పట్నాలు, నగరాలకు తరలిపోతున్న నేపథ్యంలో వారి భూముల్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పేదల్ని ఆదుకోకుంటే మున్ముందు తిండి గింజలకు కూడా కటకటలాడాల్సిందేనని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
 
 

Advertisement
Advertisement