జలదీక్షకు జనహారతి | Sakshi
Sakshi News home page

జలదీక్షకు జనహారతి

Published Wed, May 18 2016 2:48 AM

Protests over YSRC Jagan's 'anti-T' deeksha in Telangana

సాక్షి ప్రతినిధి, ఏలూరు :జలదీక్షకు ‘పశ్చిమ’ ప్రజ సంఘీభావం ప్రకటించింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేం దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో చేపట్టిన మూడు రోజుల జలదీక్షకు మద్దతుగా జిల్లాలో దాదాపు అన్ని మండలాలు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలతో హోరెత్తాయి. రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్‌లను అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ రాష్ట్ర పాలకుల ఎదుట మోకరిల్లుతున్న తీరుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన రిలే దీక్షలకు రైతులు, ప్రజలు తరలివచ్చారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుని తీరాలని నినదించారు. రాష్ట్ర సర్కారు తీరుపై నిరసన గళం విప్పారు.
 
 చంద్రబాబు నోరు మెదపరేం
  వైఎస్సార్ సీపీ జిల్లా సారథ్య బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఉంగుటూరులో రిలే దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబునాయుడు.. తెలంగాణ ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో జైలుకు పంపుతారనే భయంతోనే నిద్ర నటిస్తున్నారని విమర్శించారు. ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అనే విషయం రాష్ట్ర విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు, దిండి ప్రాజెక్ట్‌ల వల్ల రాయలసీమతోపాటు కృష్ణా, గోదావరి జిల్లాలు కూడా ఎడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి  ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల శ్రీనివాస్ (వాసుబాబు) అధ్యక్షత వహించారు.
 
  నిడమర్రు, భీమడోలు, గణపవరం మండల కేంద్రాల్లోనూ రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఏలూరు నియోజకవర్గ నాయకులు స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో నిరసన దీక్ష చేపట్టారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. తొలుత కార్పొరేటర్లు బండారు కిరణ్‌కుమార్, కర్రి శ్రీను ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసాపురంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో గోదావరి గట్టున పడవల రేవు నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తాళ్లపూడి, కొవ్వూరులో నిరాహార దీక్షా శిబిరాలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ప్రారంభించారు.
 
 జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద  దీక్షలను పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ,  పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి ప్రారంభిం చారు. నల్లజర్లలో రిలే దీక్షలను గోపాలపురం కన్వీనర్ తలారి వెంకట్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్ పాల్గొన్నారు. కొయ్యలగూడెంలో వైఎస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షలను పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ప్రారంభించారు. కామవరపు కోటలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడారు. దెందులూరులో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, దెందులూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీగా మండల కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు.

భీమవరంలో రిలే దీక్షలను నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. వీరవాసరం తూర్పు చెరువు సెంటర్‌లో రిలే నిరాహార దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఆకివీడు వైఎస్సార్ సెంటర్‌లో రిలే దీక్ష  చేశారు. ఆచంటలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తహిసీల్దార్ కార్యాలయం ఎదుట ఒకరోజు దీక్ష చేపట్టారు. అత్తిలిలో దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెన్మెత్స రామరాజు ప్రారంభించారు. తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రిలే దీక్షలను పార్టీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జి ప్రారంభించారు. గణపవరం పోలీస్ దిమ్మ సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు ప్రారంభించారు.
 

Advertisement
Advertisement