ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు

Published Wed, Nov 26 2014 3:23 AM

Protocol violations of the complaint

సాలూరు : అధికారుల ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం తో పాటు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు సాలూరు ఎమ్మె ల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. ఫిర్యాదుపై సరి గ్గా స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో పలువురు అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలను మాజీ ప్రజాప్రతి నిధులతో ప్రారంభోత్సవం చేస్తూ, ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అధికారులు సమాచారం ఇవ్వకుండా ప్రొటోకాల్‌ను ధిక్కరిస్తుండడంతో ఎమ్మెల్యేగా తన గౌరవాన్ని, శాసన సభ గౌరవాన్ని కాపాడుకోవాల్సి న అవసరం తనపై ఉందన్నారు. అందుకే జరిగిన తీరుతెన్నులను కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీల ద్వారా ప్రభుత్వానికి, శాసనసభ స్పీకర్ ద్వారా శాసనసభకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
 
 విచారణ అనంతరం అధికారులపై చర్యలు చేపడితే తాను బాధ్యుడ్ని కానని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు పత్రికాముఖంగా, ప్రత్యక్షంగా ప్రొటోకాల్ ఉల్లంఘన వద్దని అధికారులకు తెలిపానని, కానీ కొందరు అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అందుకే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తాను మాజీ ప్రజాప్రతినిధులను కూడా గౌరవించాలని ఇప్పటికే పలు కార్యక్రమాల్లో స్పష్టం చేశానని, అన్ని పార్టీలవారు, అందరు నాయకులు కలిసికట్టుగా కృషి చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నా రు. టీడీపీ నాయకులు భంజ్‌దేవ్, సంధ్యారాణి తదితరులను కూడా తాను ఎన్నడూ విస్మరించలేదని గుర్తుచేశారు. అయితే ఎమ్మెల్యేగా తన హక్కులకు అగౌరవం కలుగుతున్నందున్న భావనతోనే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
 
 అనంతరం ఫిర్యాదు చేసిన అధికారుల వివరాలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 6న మున్సిపల్ కౌ న్సిల్ సమావేశంలో తనకు కౌన్సిలర్ల మాదిరిగానే కమిషనర్ షేక్ సుభానీ కుర్చీని కేటాయించారని, ఏపీ ట్రాన్స్‌కోలో ఇటీవల భర్తీ చేసిన పోస్టుల వివరాలు ఎమ్మెల్యేగా ఆ శాఖ సీఎండీ, ఎస్‌ఈ, డీఈలను లేఖ ద్వా రా సెప్టెంబరు 22న కోరితే నేటివరకు ఏ ఒక్కరి నుంచి సమాదానం రాలేదన్నారు. ఒక ఎమ్మెల్యే వివరాలు కోరితే 15 రోజుల్లో సమాధాన ం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. అలాగే అక్టోబర్ 24న రూ. 8 లక్షలతో గోముఖీ రెగ్యులేటర్ వద్ద మరమ్మతుల పనుల శంకుస్థాపన కు నీటిపారుదల శాఖ అధికారులు పిలవలేదన్నారు.
 
 అదే నెల 28న రూ. 43 లక్షలతో గురువినాయుడుపేట- మాతుమూరు గ్రామాల రహదారి నిర్మా ణం శంకుస్థాపన పనులకు, నవంబరు 3న మాతుమూరు- తాడూరు కాజ్‌వే పనుల శంకుస్థాపన పనులకు, అదేరోజున మో సూరు కాజ్‌వే నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు తనకు సమాచారం ఇవ్వకుండానే ఇతరులతో శంకుస్థాపన జరిపారన్నారు. ఇకపై కూడా ఈ తరహా ప్రొటోకాల్ ఉల్లంఘన జరగదని భావిస్తున్నానన్నారు.  ఈ  సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ జరజాపు సూరిబాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గిరి రఘు, మాజీ కౌన్సిలర్ పిరాడి రామకృష్ణ, మాజీ ఏఎంసీ డెరైక్టర్ కర్రి పోలారావు, పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement