చట్టాలపై అవగాహన ఉండాలి | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన ఉండాలి

Published Sun, Nov 30 2014 1:01 AM

Public awareness of the need for laws

యానాం టౌన్ : ప్రజలకు చట్టాలపై అవగాహన అవసరమని, సాధికారతను పెంపొందించడానికి న్యాయపరమైన అవగాహన కీలకపాత్ర పోషిస్తోందని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి, యూటీపీఎల్‌ఎస్‌ఏ కమిటీ జడ్జి ఎం.దురైస్వామి అన్నారు. శనివారం ఉదయం స్థానిక చిల్డ్రన్ ఆడిటోరియంలో యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి లీగల్ సర్వీసెస్ అథారిటీ(యూటీపీఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో యానాంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ల ప్రారంభోత్సవ సభ ఆయన మాట్లాడారు. న్యాయపరమైన అవగాహన పెంపొందించుకోవడంలో కొన్ని దేశాలు ముందంజలో ఉన్నాయన్నారు. న్యాయపరమైన అవగాహన పెంపొందించుకోవడానికి విద్యాభివృద్ధి కూడా దోహదపడుతుందని చెప్పారు. ప్రజలు, విద్యార్థులు న్యాయ సలహాలు ఉచితంగా పొందేందుకు లీగల్ సర్వీసెస్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
 
 ుదుచ్చేరి రెండో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి టీఎస్ నందకుమార్, యానాం సబ్ జడ్జి, తాలుకా లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎన్.శివథాను, యూటీపీఎల్‌ఎస్‌ఏ డ్యూటీ కౌన్సిల్ ఏ.అబ్దుల్ష్రీద్, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సలాది దుర్గాశ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం స్థానిక డాక్టర్ ఎస్‌ఆర్‌కే ప్రభుత్వ ఆర్‌‌ట్స కళాశాల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్‌టీపీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీసాయి జూనియర్ కళాశాల, ఎన్‌ఎస్‌సీబీ ప్రభుత్వ ఐటీఐ, గౌతమి టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లలో ఏర్పాటు చేసిన క్లినిక్‌లను దురైస్వామి ప్రారంభించారు. అడిషనల్ డ్యూటీ కౌన్సిల్, తాలుకా లీగల్ సర్వీసెస్ కమిటీ ఎస్‌ఎంటీ బాషా, పీపీ కమిడి విజయ్‌కుమార్, ఇన్‌చార్జి ఆర్‌ఏఓ శిలాంబ్రేషన్, న్యాయవాదులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement