‘గిరిజన విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించండి’ | Sakshi
Sakshi News home page

‘గిరిజన విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించండి’

Published Sat, Aug 3 2019 3:23 PM

Pushpasreevani Conduct Review Meeting On Tribal Development - Sakshi

సాక్షి, విజయనగరం : గిరిజన విద్యార్థుల వసతి గృహాల్లో భోజన సదుపాయం కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ సక్రమంగా అమలు చేయకపోతే సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి హెచ్చరించారు. శనివారం ఆమె గిరిజన విద్య,వైద్యంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి, విద్యకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారన్నారు. గిరిజన విద్య కోసమే రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1245 కోట్లు కేటాయించిన ఎకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. గిరిజన వసతి గృహాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

Advertisement
Advertisement