సోషల్‌ మీడియాలో ప్రశ్నపత్రం! | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో ప్రశ్నపత్రం!

Published Sat, Mar 4 2017 9:07 AM

question paper on social media

► ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఇంగ్లిష్‌ పేపర్‌ లీక్‌?
► ప్రభుత్వం ఎంపిక  చేసింది సెట్‌–1
► వాట్సాప్‌లో లీకైంది సెట్‌–3
► ఈ ఏడాదికి సంబంధించిన పేపరే కాదన్న ఆర్‌ఐఓ

కడప ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం వైఫల్యమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా  సోషల్‌ మీడియాలో (వాట్సాప్‌) ప్రశ్నాపత్రం లీక్‌ కావడం వంటి  ఘటనలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసున్నాయి. ఇంత జరగుతున్నా అధికారులు ఇలాంటి సంఘటనలు అరికట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. తాజాగా శుక్రవారం కూడా కడప నగరంలోని ఓ కార్పొరేట్‌ కళాశాలకు చెందిన విద్యార్థుల మొబైల్‌ నుంచి ప్రశ్నపత్రం లీకైంది. సంబంధిత విషయం సోషియల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.  దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

 

పరీక్ష ప్రారంభమైన మొదటి రోజే రాయచోటి సెంటర్‌ నుంచి వాట్సప్‌లో కొశ్చన్‌ పేపర్‌ లీకైంది. ఇది జరిగిన రెండు రోజులకే మళ్లీ కడపలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్‌ పేపర్‌–1కు సంబంధించి సెటర్‌–3 ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీకైందని వందంతులు కదం తొక్కాయి. ప్రభుత్వం మాత్రం ఇంటర్‌ ఇంగ్లిష్‌ పరీక్షకు సంబంధించి శుక్రవారం సెట్‌–1 ఎంపిక చేసినప్పటికి వాట్సాప్‌లో మాత్రం సెట్‌–3 లీక్‌ కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.


ఈ ఏడాది ప్రశ్నపత్రామే కాదు
వాట్సాప్‌లో శుక్రవారం వచ్చిన ప్రశ్నపత్రం ఈ ఏడాదికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇంటర్‌కు శుక్రవారం జరిగిన మొదటి సంవత్సర ఇంగ్లిష్‌ పేపర్‌ను రాష్ట్ర అధికారులు సెట్‌–1ను ఎంపిక చేశారు. కానీ వాట్సాప్‌లో వచ్చింది సెట్‌–3 . ఇది కేవలం ఆకతాయిలు చేసిన పని తప్ప మరొకటి కాదు. సెట్‌–3కి సంబంధించిన ప్రశ్నాపత్రం పోలీస్‌స్టేషన్లలో భద్రంగా ఉంది. కనుక ఆ పేపర్‌ లీక్‌ ఆయ్యే దానికి చాన్సే లేదు, వాట్సాప్‌లో వచ్చిన పేపర్‌ గతేడాదికి సంబంధించిన పేపర్‌ తప్ప మరొకటి కాదు. ఇదంతా విద్యార్థులను తప్పుదారి పట్టించేందుకు ఆకతాయిలు చేసిన పని. ఇలాంటి వదంతులను విద్యార్థులు ఎవరూ నమ్మాల్సిన పనిలేదు.
                                                                                                                                   – రవి, ఇంటర్‌ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి.

కార్పొరేట్

Business Corporate

Advertisement
Advertisement