Sakshi News home page

రసాభాసగా యాచారం రచ్చబండ

Published Mon, Nov 18 2013 11:52 PM

racha banda program was stopped by telangana supporters

 యాచారంలో సోమవారం నిర్వహించిన రచ్చబండ.. రచ్చరచ్చగా మారింది. తెలంగాణవాదులు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వేదికపై సీఎం ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని తెలంగాణవాదులు చింపేశారు. ఇదిలాఉంటే అర్హులైన వారికి పింఛన్లు మంజూరుకాలేదని వికలాంగులు సైతం ఆందోళనకు దిగారు. దీంతో సభా ప్రారంభంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఆందోళనలతో కాసేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. తేరుకున్న పోలీసులు ఆందోళకారులను అరెస్టు చేయడంతో సభ మళ్లీ ప్రారంభమైంది.      - న్యూస్‌లైన్, యాచారం
 
  యాచారం, న్యూస్‌లైన్: యాచారంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం మూడో విడత రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు వేదికపై కూర్చున్నారు. మండల పరిషత్ పర్యవేక్షకుడు కోటేశ్వర్‌రావు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అంతలోనే వివిధ రాజకీయ పక్షాల, ప్రజాసంఘాల నాయకులు వేదికపైకి ఎక్కారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఆందోళనకారులను కిందకు దించేందుకు, ఫ్లెక్సీని లాక్కొనేందు కు సీఐ రాములు, పోలీసులు యత్నించారు. రచ్చబండను అడ్డుకోవడంలేదని.. తెలంగాణ వ్యతిరేకి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీని వేదికపై ఉంచవద్దంటూ... నిరసనకారులు ఫ్లెక్సీని పూర్తిగా చిం పేశారు. ఈ దశలో ఆందోళనకారులు జై తెలంగాణ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏ ర్పడింది. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొప్పు బాషా, మాల మహానాడు జిల్లా నాయకుడు నారిమల్ల యాదయ్య తదితరులను పోలీసులు అరెస్టుచేసి పీఎస్‌కు తరలించారు. ఆ తర్వాత సభ ప్రారంభమై వివిధ శాఖల అధికారులు మాట్లాడారు.
 
 సభావేదిక ఎదుట బైఠాయించిన వికలాంగులు
 ఇంతలోనే వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ కాళ్ల జంగయ్య కొంతమంది వికలాంగులతో కలిసి ఆందోళనకు దిగారు. అర్హులైన వికలాంగులకు పింఛన్లు మంజూరు కాకపోవడంతోపాటు, ప్రభుత్వం 140 మంది వికలాంగులకు రూ.500 పింఛన్లు రద్దు చేసిందని ఆరోపిస్తూ సభావేదిక ఎదుట బైఠాయిం చారు. ఈ క్రమంలోనే వికలాంగులు ఒక్కొక్కరుగా సభా వేదికపైకి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారిని కూడా పోలీసు లు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. ఆందోళనను గమనించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. తెలంగాణలో నిత్యం ఇలాంటి  ఘటనలు జరుగుతున్న దృష్ట్యా పోలీసులు అప్రమత్తతంగా లేకపోవడంపై అసంతృష్తి వ్యక్తం చేశారు.
 
 సభ చివరలో కూడా లబ్ధిదారులు మంజూరు పత్రాలను అందుకునే సమయంలోనూ  ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధిక సంఖ్యలో లబ్ధిదారులు వేదికపైకి చొచ్చుకొని రావడంతో అక్కడేం జరుగుతోం దో అంతుచిక్కలేదు. దీంతో అప్పటివరకు కుర్చీల్లో కూర్చున్న లబ్ధిదారులు ఒక్కసారిగా లేవడంతో సభావేదిక గందరగోళంగా మారింది. పథకాల కూపన్ల పంపిణీలోనూ నింబంధనలు పాటిం చకపోవడంతో లబ్ధిదారులు పోటీపడ్డారు. ఒక దశలో తొక్కిసలాటకు దారి తీసింది. అంతకుముందు సభా వేదికపైకి ఇబ్రహీంపట్నం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నాథ్‌రెడ్డిని పిలవడంతో తాము కూడా వేదికపైకి వస్తామని మిగతా రాజకీ య పక్షాల నాయకులు ఆందోళన చేశారు. దీంతో గుర్నాథ్‌రెడ్డి కిందకు దిగడంతో శాంతించారు. లబ్ధిదారులకు అర్హత కూపన్ల పంపిణీ సక్రమంగా లేదని సీపీఏం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement