రైల్వే నేరాల నియంత్రణకు చర్యలు | Sakshi
Sakshi News home page

రైల్వే నేరాల నియంత్రణకు చర్యలు

Published Mon, Dec 23 2013 2:19 AM

Railway crime control measures

విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ :  రైళ్లలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ రైల్వే ఎస్పీ సీహెచ్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఆదివా రం పట్టణంలోని యూత్ హాస్టల్‌లో విజయనగరం, పలాస, విశాఖపట్నం రైల్వే పోలీసు హెచ్‌సీలు, పీసీలకు నేరాల నియంత్రణపై అవగాహ న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైళ్లలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక బీట్‌లను ఏర్పాటు  చేశామన్నారు. పలాస స్టేషన్ పరిధిలో 5, విజయనగరం రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో 5, విశాఖపట్నం స్టేషన్ పరిధిలో 10 బీట్‌లను ఏర్పాటు చేశామన్నారు.
 
 గతంలో ఏ స్టేషన్ పరిధిలోని వారు ఆ స్టేషన్ వరకు తిరిగే అవకాశం  ఉండేదని, ప్రస్తుతం విశాఖపట్నం నుంచి పలాస వరకు ఆయా స్టేషన్ల పరిధిలోకి వెళ్లే అవకాశం కల్పించామని చెప్పారు. గత ఏడాది 60 శాతం దొంగతనాలు జరిగితే ఈ ఏడాది 32 శాతం దొంగతనాలు చోటుచేసుకున్నాయని తెలి పారు. గత ఏడాది 45 శాతం రికవరీ చేయగా, ఈ ఏడాది 65 శాతం రికవరీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో విశాఖపట్నం రైల్వే డీఎస్పీ ఎస్.వెంకటరావు, సీఐ డి.నవీన్‌కుమార్, పార్థసారథి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, పలాస, విజయనగ రం, విశాఖపట్నం రైల్వే పోలీసుస్టేషన్ల హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement