రైల్వే అధికారుల విస్తృత తనిఖీలు | Sakshi
Sakshi News home page

రైల్వే అధికారుల విస్తృత తనిఖీలు

Published Fri, Aug 1 2014 1:20 AM

రైల్వే అధికారుల విస్తృత తనిఖీలు

పాకాల:  పాకాల రైల్వే జంక్షన్లో గురువారం గుంతకల్ రైల్వే డివిజన్ అడిషనల్ రీజనల్ మేనేజన్ పీవీవీ సత్యనారాయణ విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తూ రైల్వే ఆదాయానికి గండి కొడుతున్న ప్రయాణికులను అదుపు చేసే దిశగా ఆయన చిత్తూరు, తిరుపతి, రేణిగుంట స్టేషన్ల నుంచి ప్రత్యేక తనిఖీ బృందాలను తీసుకువచ్చి ఆగిన రైళ్లలో టికెట్ తనిఖీలు చేపట్టారు. రాత్రి తొమ్మిదింటి వరకు ఆయన స్టేషన్ అంతటా తిరుగుతూ నిశితంగా పరిశీలించారు. చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ ద్వారకనాథ్ ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న ప్యాసెంజర్ల నుంచి రూ.51 వేలు జరిమానా వసూలు చేశారు.

రైలులో 40 శాతం మేరకు టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. పాకాల స్టేషన్ పరిధిలో రెండేళ్ల కిందట వచ్చే ఆదాయంతో పోలిస్తే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. స్టేషన్లో ప్రయాణికులకు వుంచినీటి సౌకర్యం బాగుందని, అయితే అక్కడక్కడా లీకేజీలు ఉన్నాయని, సరిదిద్దుకోవాలని స్టేషన్ మేనేజర్ జనార్ధన్‌రావుకు సూచించారు. అనంతరం స్థానికంగా ఉన్న రైల్వే టెన్నిస్ క్లబ్‌ను ఆయన సందర్శించారు. స్థానిక రైల్వే క్వార్టర్స్ పైకప్పు శిథిలావస్థకు చేరుకుందని, దాదాపు 50 గదులకు వురో ఏడాదిలో మరమ్మతులు చేయిస్తామన్నారు.

పాకాల జంక్షన్‌లో సౌకర్యాల స్థాయి పెంపునకు కృషి చేస్తామన్నారు. వురో 15 రోజుల్లో వుళ్లీ తాను ఇక్కడికి వస్తానని, టికెట్టు లేకుండా చేస్తున్న ప్రయాణాలను నివారించి రైల్వే ఆదాయన్ని పెపొందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో పాకాల స్టేషన్ మేనేజర్ జనార్దన్‌రావు, సూపర్‌వైజర్లు జయదేవ్, శ్రీహరిరావు, టెలికం జేఈలు ఆనందకుమార్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement