హస్తిన బాట | Sakshi
Sakshi News home page

హస్తిన బాట

Published Sun, Feb 16 2014 1:54 AM

Ramlila Ground New Delhi on 17th february  toAgainst Telangana bill Mahadharna

 ఏలూరు, న్యూస్‌లైన్:ఢిల్లీలో సమైక్య నినాదాన్ని హోరెత్తించేందుకు జిల్లాకు చెందిన ఎన్జీవోలు, వైసీపీ నాయకులు, కార్యక ర్తలు శనివారం సాయంత్రం ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లలో బయలుదేరారు.  ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే మహాధర్నాలో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి సుమారు 1,500 మంది ఎన్జీవోలు తరలివెళ్లారు. ఏలూరు పెద్దరైల్వే స్టేషన్ నుంచి సుమారు 800 మంది ‘సమైక్యాంధ్ర ఎన్జీవో ప్రత్యేక రైలు’ ఎక్కారు. ఈ రైలుకు ఎన్జీవో అసోసియేషన్ జిల్లా శాఖ కార్యదర్శి టి.యోగానందం, నాయకులు హరనాథ్, చోడగిరి శ్రీనివాస్ జెండా ఊపి ైరె లును పంపారు. ప్రత్యేక రైలు సౌకర్యంలేని ప్రాంతాల నుంచి, ఆకివీడు, దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల నుంచి ఎన్జీవోలు పెద్ద స్టేషన్‌కు తరలివచ్చారు.
 
 ఇదిలావుండగా నరసాపురం ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి 50 మంది ఎన్జీవోలు ఢిల్లీకి పయనమయ్యారు. పాలకొల్లు నుంచి 50 మంది, తణుకు నుంచి 80 మంది, తాడేపల్లిగూడెం నుంచి 70 మంది బయల్దేరి వెళ్లారు. భీమవరం, నిడదవోలు, ఉండి ప్రాంతాల నుంచి కూడా ఎన్జీవోలు హస్తినబాట పట్టారు. చింతలపూడి, పోలవరం ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ఎన్జీవోలు ఢిల్లీ వెళ్లారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ జిల్లాలో చేపట్టిన ఉద్యమం శనివారం 200వ రోజుకు చేరుకుంది. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జూలై 30న చేపట్టిన నిరసన దీక్షలు 200 రోజుకు చేరారుు. దీక్ష 200 రోజుకు చేరిన సందర్భంగా గాంధీబొమ్మల సెంటర్‌లో జేఏసీ అధ్యక్షుడు కె.సత్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
 
 వెల్లువలా వెళ్లిన వైసీపీ కార్యకర్తలు
 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు నగరం నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. శనివారం సాయంత్రం 6.30 గంటలకు రాజమండ్రి నుంచి వచ్చిన ప్రత్యేక రైలులో కార్యకర్తలు ఉత్సాహంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు వెళ్లారు. పార్టీ నాయకుడు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పర్యవేక్షణలో నాయకులు పాము శామ్యూల్, కోలపల్లి ఉమాశంకర్, కర్రి శ్రీనులతో పాటు సుమారు 60 మంది కార్యకర్తలు ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. వీరికి పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, మున్నుల జాన్ గురునాథ్ తదితరులు వీడ్కోలు పలికారు.
 
 ఆహార, పానీయాలు అందించిన తోట
 ఢిల్లీ వెళుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆహార పానీయాలను ఏలూరు రైల్వే స్టేషన్‌లో అందజేశారు. విభజన బిల్లును పార్లమెంటులో కూడా అన్ని పార్టీలూ తిరస్కరించాలని కోరుతూ వైసీపీ తలపెట్టిన ఈ ఆందోళనలో పాల్గొనడానికి వెళుతున్న కార్యకర్తలను తోట చంద్రశేఖర్ అభినందించారు. దెందులూరు సమన్వయకర్త సీహెచ్ అశోక్‌గౌడ్, కైకలూరు సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షులు జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement