మున్సిపల్ ఎన్నికలకు అంతా రెడీ ! | Sakshi
Sakshi News home page

మున్సిపల్ ఎన్నికలకు అంతా రెడీ !

Published Sat, Oct 26 2013 1:04 AM

Ready for Municipal Elections: State election commission

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందు కు వెళుతుండగా, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగసిపడడంతో  మున్సిపల్  ఎన్నికలు వాయిదా పడ్డాయి. రా ష్ట్రంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్నదని భావించిన ఎన్నికల సం ఘం ఈనెల 29వ తేదీన పురపాలక శాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పా టు చేసింది. అయితే రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం సమైక్యాంధ్ర, తెలంగాణ పేరిట సభలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వంలోని పెద్దలు కూడా ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం సుముఖంగా లేని తరుణంలో ఎన్నికల సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
 
 ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని పురపాలక శాఖ ఉన్నతాధికారులు సిద్ధం చే శారు.149 మున్సిపాలిటీలు, 11  కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎన్నికల సంఘానికి నివేదించనున్నట్టు సమాచారం. డిసెం బర్ 31లోగా ఎన్నికలు నిర్వహిస్తామని పురపాలక శాఖ సెప్టెంబర్ మూడో తేదీన హైకోర్టుకు సమర్పించిన  అఫిడవిట్‌కు అనుగుణంగా ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళికను అధికారులు సిద్దం చేశారు. మొదటి దశలో 149 మున్సిపాలిటీలు 11 కార్పొరేషన్లకు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, మరో 18 మున్సి పాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి పలు సమస్యలు ఉన్నాయని ఎన్నికల సంఘానికి నివేదించనుంది.

Advertisement
Advertisement