సివిల్స్‌కు తగ్గిన హాజరు | Sakshi
Sakshi News home page

సివిల్స్‌కు తగ్గిన హాజరు

Published Mon, Aug 24 2015 1:12 AM

సివిల్స్‌కు తగ్గిన హాజరు

దరఖాస్తు చేసింది 15,589
 33 శాతానికి మించని హాజరు
 కట్టుదిట్టమైన ఏర్పాట్లు
 

విజయవాడ  సెంట్రల్ : సివిల్స్ (ప్రిలిమినరీ) పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గింది. నగరంలో 32 కేంద్రాల్లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. 15,589 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా ఉదయం 5,201(33.36) శాతం, మధ్యాహ్నం 5,133 (32.93) శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. మూడుసార్లకు మించి పరీక్ష రాసే అవకాశం లేకపోవడంతో అభ్యర్థులు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో హాజరుశాతం తగ్గినట్లు అధికారులు అంచనా కట్టారు. ఒక్కో కేంద్రంలో 20 నుంచి 24 మంది విద్యార్థులు పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేశారు. హాజరు శాతం తగ్గడంతో 2 నుంచి 10 మంది విద్యార్థులు మాత్రమే కనిపించారు. అభ్యర్థులు లేక కొన్ని గదులు ఖాళీగా కనిపించాయి. శాతవాహన కళాశాల ఆవరణలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం లో 43 మందికిగాను 18 మంది హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఉదయం హాజ రైన అభ్యర్థుల్లో 68 మంది మధ్యాహ్నం డుమ్మా కొట్టారు. చివరి నిమిషంలో కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు పరుగులు తీయాల్సి వచ్చింది.

 పకడ్బందీగా ఏర్పాట్లు
 బిషప్ అజరయ్య స్కూల్, శాతవాహన కళాశాల ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ బాబు.ఏ పరిశీలించారు. ఇన్విజిలేటర్లకు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జేసీ-2 ఒంగోలు శేషయ్య ఆధ్వర్యంలో పని చేసిన నలుగురు అధికారుల బృం దం ఏర్పాట్లపై పర్యవేక్షణ చేశారు. సెల్‌ఫోన్లను తీసుకు వెళ్లకుండా నిరోధించారు. నిరుపయోగంగా పరీక్షలకు చెందిన బుక్‌లెట్స్‌ను కాల్చివేశా రు. ఉపకేంద్రాల నిర్వాహకుల సమస్యల్ని పరిష్కరించేందుకు గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేశా రు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నలుగురు అధికారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు బెంజిసర్కిల్ సమీపంలోని నారాయణ కళాశాల, గాంధీ, మాంటిస్సోరి, చైతన్య, ఆంధ్రా లయో లా కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.  సీపీ గౌతం సవాంగ్ నేతృత్వంలో పోలీసులు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు.
 
 

Advertisement
Advertisement