విద్యాపీఠంలో రీసెట్ ఫలితాలు విడుదల

9 Sep, 2015 03:54 IST|Sakshi
విద్యాపీఠంలో రీసెట్ ఫలితాలు విడుదల

యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో రీసెట్ (విద్యావారధి) ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం వీసీ హరేకృష్ణశతపతి విడుదల చేశారు. గత నెల 9న దేశంలోని 17 కేంద్రాల్లో ఈ ప్రవేశపరీక్ష నిర్వహించారు. 1,690 మంది దరఖాస్తు చేయగా 1,076 మంది పరీక్ష రాశారు. వారిలో 633 మంది అర్హత సాధించారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీకి చెందిన లాల్‌బహుదూర్‌శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ ఆర్‌సీ పాండే, రాష్ట్రీయ సంస్కృత సంస్థ పరీక్షల నియంత్రణాధికారి జీఆర్ మిశ్రా, రిజిస్ట్రార్ ఉమాశంకర్ పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు