మిన్నంటిన మృత్యుఘోష | Sakshi
Sakshi News home page

మిన్నంటిన మృత్యుఘోష

Published Thu, Feb 26 2015 1:35 AM

road accident by Timmasamudram

ఆటోను లారీ ఢీకొని ఏడుగురు మృతి, ముగ్గురికి గాయాలు
ఆర్తనాదాలతో హోరెత్తిన తి్మ్మసముద్రం

 
చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, గాయపడిన వారి ఆర్తనాదాలు, కుటుంబ సభ్యుల రోదనలతో తివ్ముసవుుద్రంలో బుధవారం మృత్యుఘోష మిన్నంటింది. లారీ రూపంలో మృత్యువు ఏడుగురి ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పెను విషాదం అలముకుంది. లారీ, ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.
 
 పిచ్చాటూరు(కేవీబీ పురం):  చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, కుటుంబ సభ్యుల రోదనలతో  కేవీబీపురం వుండలం తివ్ముసవుుద్రంలో బుధవారం మృత్యుఘోష మిన్నంటింది. షేర్ ఆటోను లారీ ఢీకొనడంతో ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి నుంచి పదిమంది ప్రయాణికులతో షేర్ ఆటో కేవీబీపురానికి వస్తుండగా కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద పిచ్చాటూరు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న లారీ రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన చెంగయ్యు(25), మఠం గ్రామానికి చెందిన ఉష(35), సబ్బులక్ష్మి(55), దిలీప్(3), జ్ఞానమ్మకండ్రిగకు చెందిన పద్మ(50), కళత్తూరుకు చెందిన భూపతవ్ము(50), ఓళూరు గ్రామానికి రాజయ్యు(25) అక్కడికక్కడే వుృతిచెందారు. వురో వుుగ్గురు తీవ్ర గాయూలపాలయ్యూరు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. ఇక తమకు దిక్కెవరు అంటూ లబోదిబోమన్నారు. ఉదయం తమ కళ్ల ఉండి ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.

లారీడ్రైవర్ తాగి ఉండడమే కారణం..

లారీ డ్రైవర్ వుద్యం తాగి ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తాగేసి లారీని రాంగ్ రూట్లో నడపడంతో ఆటోడ్రైవర్ పక్కకు తిప్పినా లాభం లేకపోయిందని అంటున్నారు. పైగా ఆటోడ్రైవర్ ఓవర్ లోడ్‌తో రావడం కూడా మరో కారణంగా తెలిపారు. ఈ ఇద్దరి నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలను బలితీసుకుందని అంటున్నారు.

దిలీప్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తున్న  సుబ్బవ్ము, ఉష

మృతుల్లో సుబ్బులక్ష్మి, ఉష, దిలీప్ ఒకే కుటుంబానికి చెందినవారు. దిలీప్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అమ్మ ఉష, అమ్మమ్మ సుబ్బులక్ష్మి వుఠం గ్రామం నుంచి శ్రీకాళహస్తికి వచ్చారు. ఆస్పత్రిలో చూపించుకుని ఆటోలో స్వగ్రావూనికి తిరిగి వస్తున్నారు. తివ్ము సవుుద్రంలో జరిగిన రోడ్డు ప్రవూదంలో వుృత్యువాత పడ్డారు. ఉషకు భర్త వుల్లి, వురో కుమారుడు ఉన్నారు.
 
చెంగయ్యు మీ-సేవ కేంద్రానికి వస్తూ..

కోవనూరు గ్రావూనికి చెందిన చెంగయ్యు సర్టిఫికెట్ కోసం కేవీబీ పురంలోని మీ-సేవా కేంద్రానికి పయునవుయ్యూడు. కోవనూరు వద్ద కేవీబీపురం వస్తున్న ఆటో ఎక్కాడు. ప్రవూదంలో వుృతువాతపడ్డాడు.

పూల వ్యాపారం ముగించుకొని వస్తూ..

జ్ఞానవ్ము కండ్రిగ గ్రావూనికి చెందిన పద్మ రోజూ శ్రీకాళహస్తిలో పూల వ్యాపారం చేసేది. బుధవారం వ్యాపారం వుుగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైంది. శ్రీకాళహస్తిలో ఆటో ఎక్కి వస్తూ రోడ్డు ప్రవూదంలో వురణించింది.
 
భూపతవ్ము కూలిపని చేసి తిరిగి వస్తూ..

 కళత్తూరు హరిజనవాడకు చెందిన భూపతవ్ము శీకాళహస్తిలో కూలిపని వుుగించుకొని ఇంటికి వచ్చేందుకు ఆటో ఎక్కింది. ప్రవూదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లింది.

రాజయ్య ఊరూరా గాజుల వ్యాపారం చేస్తూ..

కేవీబీపురం వుండలం ఓళూరు గ్రావూనికి చెందిన రాజయ్యు ఊరూరు తిరిగి గాజుల వ్యాపారం చేసేవారు. ఈ క్రవుంలో వ్యాపారం వుుగించుకొని స్వగ్రావూనికి రావడానికి ఆటో ఎక్కాడు. తివ్ముసవుుద్రం వద్ద లారీ ఢీకొని వుృతి చెందాడు.
 
అందర్నీ పోగొట్టుకున్నా : ఉష భర్త మల్లి

రోడ్డు ప్రమాదం నా భార్య ఉష, కుమారుడు దిలీప్, అత్త సుబ్బులక్ష్మిని పొట్టనబెట్టుకుంది. కుమారుడికి ఆరోగ్యం బాగా లేదు ఆస్పత్రికి పోయి వస్తామని చెప్పి ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మమ్మల్ని ఒంటరిని చేశారు. ఇక నేను ఎవరి కోసం బతకాలి దేవుడా అంటూ రోదించడం హృదయాన్ని కలచి వేసింది.
 
 

Advertisement
Advertisement