Sakshi News home page

ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్

Published Tue, Feb 17 2015 8:36 AM

RPF Inspector arrested in vizag

విశాఖపట్నం : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే జోజి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు సోమవారం రాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి... పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేసి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా... నిందితునికి జడ్జి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించారు.

పోలీసుల కథనం ప్రకారం.... ఓ వ్యక్తి.. ఏలూరు - తాడేపల్లిగూడెం మధ్య నడిచే రైళ్లలో తినుబండారాలు విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ను కోరాడు. అందుకు రెండు నెలలకు గాను రూ. 6000 వేలు చెల్లించాలని జోజి డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని సదరు వ్యక్తి జోజిని తెలిపాడు. అంతకంటే తక్కువ ఇస్తే అనుమతి ఇచ్చేది లేదని జోజి చెప్పడంతో.. బాధితుడు సీబీఐను ఆశ్రయించాడు. దీంతో సీబీఐ వలపన్ని  జోజిని అరెస్ట్ చేశారు.     

Advertisement

తప్పక చదవండి

Advertisement