తిరుపతిలో రూ.134 కోట్లతో మల్టీప్లెక్స్ | Sakshi
Sakshi News home page

తిరుపతిలో రూ.134 కోట్లతో మల్టీప్లెక్స్

Published Thu, Aug 14 2014 6:01 AM

తిరుపతిలో రూ.134 కోట్లతో మల్టీప్లెక్స్

- స్మార్ట్ సిటీ నేపథ్యంలో తెరపైకి వచ్చిన మల్టీప్లెక్స్ నిర్మాణం
- పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన ఎస్‌బీపీఎల్ సంస్థ
- కాంప్లెక్స్ పూర్తయితే 4 భారీ సినిమా స్క్రీన్ల్లు, ఫుడ్‌కోర్టు, మాల్స్

తిరుపతి కార్పొరేషన్ : తిరుపతిని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వాణి జ్యపరంగా భారీప్రాజెక్టులు చేపట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. హెదరాబాద్, విశాఖపట్నం తరహాలో తిరుపతిలో భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్టు రూపకల్పనకు తుడా శ్రీకారంచుట్టింది. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి 2 కిలోమీటర్ల లోపున్న తుడా స్థలం  అనువైనదిగా అధికారులు గుర్తించారు.
 
ఇప్పుడు రూ.134 కోట్లతో..
తిరుపతిని స్మార్ట్‌సిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మల్టీకాంప్లెక్స్ నిర్మాణం పనులు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన ఎస్‌బీపీఎల్ సంస్థ తిరిగి పను లు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. 2009లో అప్పటి లీజు ప్రకారం రూ.114 కోట్లకు ఒప్పుకున్న తుడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అందులో భాగంగా రూ.134 కోట్లతో మెగా షాపింగ్‌మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఎస్‌బీపీఎల్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై వంద రోజుల్లో ఆసంస్థతో పూర్తిస్థాయిలో అగ్రిమెంట్ చేసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మల్టీప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తుడా అందిస్తుంది. ఈ స్థలంలో నిర్మాణం చేపట్టే సంస్థ 33 సంవత్సరాల వరకు లీజు పద్ధతిలో మల్టీప్లెక్స్ నిర్వహ ణ బాధ్యతలు చేపడుతుంది.
 
వంద రోజుల్లో అగ్రిమెంట్
 గతంలో రూ.114 కోట్లతో నిర్మించాలనుకున్న మల్టీప్లెక్స్ నిర్మాణం అనివార్య కారణాలతో ఆగిపోయింది. ప్రస్తుతం అదే సంస్థతో తిరిగి నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వంద రోజుల్లో ఆసంస్థతో అగ్రిమెంట్ చేసుకోనున్నాం. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
 - ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులు,తుడా

Advertisement

తప్పక చదవండి

Advertisement