నేడు ఆర్టీసీ ఎన్నికలు | Sakshi
Sakshi News home page

నేడు ఆర్టీసీ ఎన్నికలు

Published Thu, Feb 18 2016 1:16 AM

rtc elections starts now

శ్రీకాకుళం-1 డిపోలో ఓటర్ల సంఖ్య: 498
శ్రీకాకుళం-2 డిపోలో: 492
పాలకొండ డిపో పరిధిలో: 533
పలాస పరిధిలో: 380
టెక్కలి పరిధిలో: 347

 
ముగిసిన ప్రచారం ఐదు డిపోల్లో ఓటింగు రాత్రికల్లా ఫలితాలు
  
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. గెలుపు కోసం యూనియన్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలతోపాటు నెక్ రీజియన్‌లోని తొమ్మిది డిపోలకు ఈసారి జరగనున్న ఎన్నికల్లో ప్రధానంగా ఎంప్లాయిస్ యూనియన్(బస్సు గుర్తు), ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్(కాగడా గుర్తు), ఆర్టీసీ స్టాఫ్ ఆండ్ వర్కర్స్ ఫెడరేషన్(నక్షత్రం గుర్తు)లు బరిలో నిలిచాయి. కార్మికునికి రెండు ఓట్లు ఉంటాయి. క్లాజ్-3(తెలుపు రంగు బ్యాలెట్) ఓటు రాష్ట్రంలో గుర్తింపు కోసం, క్లాజ్-6(గులాబిరంగు బ్యాలెట్) ఓటు నెక్‌రీజియన్‌లో గుర్తింపు కోసం ఇస్తారు. ఉదయం 5గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. ఇప్పటికే ప్రచారం హోరెత్తిపోయింది. తమ వారికే ఓటువేయాలని యూనియన్ నాయకులు కార్మికులను వ్యక్తిగతంగా కలిసి అభ్యర్ధిస్తున్నారు.

 5 డిపోలలో ఓటర్ల సంఖ్య
శ్రీకాకుళం జిల్లా ఆర్టీసీ పరిధిలోని అయిదు డిపోలలో 2,250 మంది ఓటర్లున్నారు. శ్రీకాకుళం ఒకటి, శ్రీకాకుళం రెండవ డిపోలు, పాలకొండ, టెక్కలి, పలాస డిపోలు ఉన్నాయి. శ్రీకాకుళం ఒకటవ డిపో పరిధిలో 498, రెండవ డిపో పరిధిలో 492, పాలకొండ డిపో పరిధిలో 533, టెక్కలి డిపో పరిధిలో 347, పలాస డిపో పరిధిలో 380మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా నేడు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. విధుల నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్ళే కార్మికులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోనున్నారు. సాయంత్రం ఆరు తర్వాత లెక్కింపు ప్రారంభమవుతుంది. డిపోల పరిధిలో ఫలితాలు దాదాపుగా రాత్రికి తేలిపోనున్నాయి.


ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం అన్ని యూనియన్లు ప్రచారాలను, సమావేశాలను పోటా పోటీగా నిర్వహించాయి.  గుర్తులను ప్రచారం చేసేందుకు కరపత్రాలు, పోస్టర్లను, కటౌట్‌లను, ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కార్మికులను ఆకట్టుకున్నారు.  బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే ఓటింగ్‌లో తమ యూనియన్‌కే ఓటువేయాలంటూ ఎవరికి వారు లోపాయికారి వ్యూహానికి తెరతీస్తున్నారు.
 
 
బరిలో:
ఎంప్లాయీస్ యూనియన్  (బస్సు గుర్తు)
ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (కాగడా ్త)
ఆర్టీసీ స్టాఫ్ ఆండ్ వర్కర్స్ ఫెడరేషన్ (నక్షత్రం)

Advertisement

తప్పక చదవండి

Advertisement