ప్రభుత్వ పెద్దలకే ‘కానుక’ | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పెద్దలకే ‘కానుక’

Published Sat, Dec 9 2017 12:04 AM

rules violation in Sankranthi Chandranna Gifts tenders process - Sakshi

సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు పేదల చేతుల్లో పప్పు, బెల్లాలు పెడుతూ తాము మాత్రం రూ.కోట్లు నొక్కేస్తున్నారు. ప్రభుత్వ పెద్ద లు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నా అడిగేవారే లేకుండా పోయారు. చంద్రన్న కానుక పేరిట సంక్రాంతి పండుగకు ప్రభుత్వం రెండేళ్లుగా 5 రకాల సరుకులను రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డులున్న 1.40 కోట్ల కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలి సిందే. నాణ్యమైన సరుకులను సరఫరా చేసేందుకు టెండర్లను పిలుస్తున్నారు.

వాస్తవానికి అధికారుల చలవతో ప్రభుత్వ పెద్దల సన్నిహితులకే ఈ టెండర్లు దక్కు తున్నాయి. వారు నాసిరకం సరుకులు సర ఫరా చేస్తున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అన్ని సరుకుల ధరలకు రెక్కలు వచ్చే సంక్రాంతి పండుగకు తెల్లరేషన్‌ కార్డున్న ఒక్కో కుటుంబానికి కిలో గోధుమ పిండి, అర కిలో చొప్పున పామాయిల్, బెల్లం, శనగపప్పు, కందిపప్పతోపాటు 100 గ్రాముల నెయ్యి ప్యాకెట్‌ రూపంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందులో భాగంగా 10,330 మెట్రిక్‌ టన్నుల గోధుమ పిండి, 7,115 మెట్రిక్‌ టన్నుల చొప్పున బెల్లం, శనగపప్పు, కంది పప్పు, 7,115 కిలో లీటర్ల పామాయిల్, 1,432 కిలో లీటర్ల నెయ్యి సరఫరా చేసేం దుకు టెండర్లు ఆహ్వానించారు.

చంద్రన్న కానుక కోసం నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్‌ సేకరించిన కందులను ఒక టన్ను రూ.5,050 ప్రకారం 12 వేల టన్నులను పౌరసరఫరాల సంస్థ కొనుగో లు చేసింది. కందులను మర ఆడించి కంది పప్పును సరఫరా చేసేందుకు తొలుత టెండర్లను పిలిచారు. రైతులు పండించిన కందిపప్పును మిల్లుకు తీసుకెళ్తే వస్తు మార్పిడి కింద 100 కిలోల కందులకు 74 కిలోల కందిపప్పు ఇస్తున్నారు. అధికార పార్టీ నేతలు సూచించిన వారికే టెండర్‌ దక్కేలా నిబంధనల్లో మార్పు చేయడం తోపాటు వారికి లబ్ధి చేకూర్చేందుకు 100 కిలోల కందులకు 64 కిలోల కందిపప్పు ఇస్తే చాలంటూ టెండర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో నాగపూర్‌కు చెందిన ఒక మిల్లర్‌కు టెండర్‌ దక్కింది. బహిరంగ మార్కెట్‌లో రిటైల్‌గా కిలో కంది పప్పు ధర రూ.50 నుంచి రూ.55 వరకు ఉంది. కిలో రూ.80 చొప్పున సరఫరా చేసేలా టెండర్‌ కట్టబెట్టారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే ఇలా అన్ని సరుకుల ధరలు విపరీతంగా పెంచేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు రూ.60 కోట్లు మింగేసే అవకాశం ఉందని సమాచారం. 

Advertisement
Advertisement