కానిస్టేబుల్, హోంగార్డులపై జడ్జి ఫిర్యాదు!

30 Nov, 2014 18:55 IST|Sakshi

విశాఖ: తనపై హెంగార్డుతో కలిసి ఒక కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించాడంటూ విజయనగరం జిల్లా ఎస్.కోట జడ్జి కాశీ విశ్వనాథాచారి ఫిర్యాదు చేశాడు. తాను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో శుభలేఖలు పంచేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కానిస్టేబుల్, హోంగార్డులు దురుసుగా ప్రవర్తించారంటూ జిల్లా జడ్జికి ఫిర్యాదు చేశారు.

 

తన కారును రెండున్నర గంటలపాటు నిలిపి వేధించారని స్పష్టం చేశారు.ఎన్ఏడీ జంక్షన్ చేరుకున్న తనపై వారు అసభ్యపదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై బార్ అసోసియేషన్ మండిపడింది. దీనికి  నిరసనగా రేపు విధులు బహిష్కరిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు