'ఈ సారి కూడా సంక్రాంతి కానుక' | Sakshi
Sakshi News home page

'ఈ సారి కూడా సంక్రాంతి కానుక'

Published Sat, Dec 26 2015 5:21 PM

sankranthi kanuka for ap people next year, says chandra babu

జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఈసారి కూడా పశువైద్యశిబిరాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈసారి కూడా సంక్రాంతి కానుక ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు.  సంక్రాంతికి ఊరూరా ఉత్సవాలు నిర్వహించాలని, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని చెప్పారు. శనివారం చంద్రబాబు అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

స్కూల్ డ్రాప్ అవుట్స్‌పై పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. నర్సరీలను ఏర్పాటు చేయడానికి  15 వేల పాఠశాలలను గుర్తించామని అధికారులు సీఎంకు వివరించారు. ఎన్ఆర్‌ఈజీఎస్ పనులకు నిధుల కొరత లేదని, 3నెలల్లో రూ.500 కోట్లు ఖర్చు చేసే వీలుందని, అధికారులు దీన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈనెల 30న కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

పేదలకు అందుబాటులో అన్నిరకాల వైద్యసేవలు అందించడానికి వీలుగా వైద్య ఆరోగ్య శాఖలో సమూల సంస్కరణలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులలో జనవరి 1 నుంచి హెల్త్ చెకప్ ఉచిత సేవలు ప్రారంభిస్తున్నట్టు వైద్యశాఖ అధికారులు ఆయనకు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు పంపిణీకి సిద్దంచేసినట్టు చెప్పారు. బ్లడ్ టెస్టు దగ్గర నుంచి అన్ని రకాల టెస్టులను ప్రాథమిక ఆస్పత్రి నుంచి జిల్లా ఆస్పత్రి వరకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ఫ్లోరైడ్ సమస్య వున్న 329 ప్రాంతాలలో జనవరి నాటికి మినరల్ వాటర్ సరఫరా చేయాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement