సారా రహిత రాష్ట్రమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

సారా రహిత రాష్ట్రమే లక్ష్యం

Published Wed, Mar 1 2017 10:57 AM

Sarah-free state target

► ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు
కల్యాణీడ్యాం(చంద్రగిరి): రాష్ట్రాన్ని సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు. మండలంలోని కల్యాడీ డ్యాం సమీపంలో ఉన్న పోలీసు ట్రైనింగ్‌ కళాశాలలో(పీటీసీ) మంగళవారం ప్రొహిబిషన్్ అండ్‌ ఎక్సైజ్‌ పోలీసుల రెండో బ్యాచ్‌ శిక్షణ తరగతుల ము గింపు కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సారా ను పూర్తిగా నిరూ్మలించి, సారా రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

ఇప్పటికే రాష్ట్రంలోని మూడు జిల్లాలను దాదా పు 80 శాతం సారా రహితంగా తీర్చిదిద్దారని తెలిపారు. మానవహకు్కల ను గౌరవిస్తూ, సమాచార హకు్కలకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పీటీసీ ప్రిన్సిపాల్‌ సూర్య భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ పీటీసీలో పోలీసులకు మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖలో్లని అధికారులు, సిబ్బందికి సైతం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని తెలి పారు. అనంతరం 106 మంది ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌ నిర్వహించారు. శిక్షణకాలంలో ఉత్త మ ప్రతిభ కనబరిచిన వారికి మెమెంటోలతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ రిషికేశవ్‌ రెడ్డి, డీఎస్పీలు నాగరాజు, వరప్రసాద్, రామరాజు, అల్లాబ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement