యమపాశమైన ఎర్త్‌వైరు | Sakshi
Sakshi News home page

యమపాశమైన ఎర్త్‌వైరు

Published Wed, Sep 17 2014 3:03 AM

యమపాశమైన ఎర్త్‌వైరు - Sakshi

కడవకొల్లు(ఉయ్యూరు) : ఎర్త్ వైరు ఓ వ్యవసాయ కూలీ పాలిట యమపాశమైంది. తూ ము వద్ద మట్టిని తవ్వుతూ అక్కడే ఉన్న విద్యు త్ స్తంభానికి చెందిన ఎర్త్‌వైరును ప్రమాదవశాత్తు తాకి షాక్‌కు గురై మరణించాడు. మండలంలోని కడవకొల్లులో మంగళవారం ఈ  ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకా రం.. గ్రామంలోని దళితవాడలో కచ్చా మురుగు కాలువల తవ్వకం పనులు చేపట్టారు. మంగళవారం 10 మంది కూలీలు ఈ పనులు నిర్వహిస్తున్నారు. సిమెంట్ రోడ్డు కింద ఉన్న తూములో మట్టిని దళితవాడకు చెందిన సరి హద్దు ఏసుబాబు (31)తో పాటు నక్కా వెంకటేశ్వరరావు తవ్వుతున్నారు. పక్కనే విద్యుత్ స్తంభం ఉంది. పలుగుతో ఇద్దరూ మట్టిని తొల గించే క్రమంలో షాక్ తగిలినట్లనిపించింది.
 
స్తంభానికి అవతలి వైపు పనిచేస్తున్న వెంకటేశ్వరరావు పలుగును వదిలి వెనక్కి పడిపోయాడు. స్తంభం పక్కనే మట్టి తవ్వుతున్న ఏసుబాబు కూడా షాక్‌కు గురయ్యాడు. కొద్దిసేపటికి తేరుకుని అతడు పలుగును బయటకు తీసే క్రమం లో భూమిలో ఉన్న ఎర్త్ వైరుకు చేయి తగిలింది. దీంతో ఏసుబాబు తీవ్ర విద్యుదాఘతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పనులను పర్యవేక్షిస్తున్న సర్పంచ్ యర్రపోతు అంకవరప్రసాద్‌తో పాటు స్థానికులు అతడిని కాపాడేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. సమాచారం అందుకున్న విద్యుత్‌శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేసి ఘటనా స్థలికి వచ్చారు. సీఐ మురళీ రామకృష్ణ, రూరల్ పోలీసులు కూడా వచ్చి వివరాలు సేకరిం చారు.
 
బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలిస్తే అంగీకరించేది లేదని విద్యుత్ అధికారులు, పోలీసులను నిలదీశారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఉయ్యూరు డీఈఈ మురళీమోహన్, ఏఈఈ నాగేశ్వరరావు, స్థానిక పెద్దలు, కుటుం బ సభ్యులతో చర్చించి చట్టప్రకారం ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాం తించారు. మృతుడి కుటుంబీకుల నుంచి ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించారు. ఏసుబాబు   మృతదేహం వద్ద కుటుంబ సభ్యు లు గుండెలవిసేలా రోదించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement