మొదలైన పై-లీన్ తుపాను అలజడి | Sakshi
Sakshi News home page

మొదలైన పై-లీన్ తుపాను అలజడి

Published Sat, Oct 12 2013 5:02 PM

Sea Wave height of 3 meters due to Phailin cyclone

విశాఖపట్నం: పై-లీన్ తుపాను అలజడి  మొదలైంది. కాకినాడ-ఉప్పాడ తీరంలో 3 మీటర్ల ఎత్తుకు  అలలు ఎగసిపడుతున్నాయి. వాకలపూడి బీచ్‌ వద్ద  సముద్రం 20 మీటర్ల ముందుకొచ్చింది.

* విజయనగరం జిల్లా బోగాపురంలో 33 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15వేల మందిని అధికారులు  తరలిస్తున్నారు.
*చింతపల్లి తీరంలో సముద్రం 40 మీటర్లు ముందుకొచ్చింది.
* నెల్లూరు జిల్లాలో కూడా సముద్రం మందుకు చొచ్చుకు వస్తోంది.  తీరప్రాంత ప్రజలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* పై-లిన్‌ తుఫాన్‌ ప్రభావం కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు.
* విశాఖపట్నం  పోర్టు రక్షణ గోడ రెండు చోట్ల కూలింది.
* భీమిలి మండలం మంగమారిపేట గ్రామంలో  సముద్రపు నీరు ఇళ్లలోకి చేరుతోంది.     

* తుపాన్ కంట్రోల్ రూమ్ల ఫోన్ నెంబర్లు:

శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191
విశాఖపట్టణం: 1800425002
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093
పశ్చిమగోదావరి: 0881230617
కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077
గుంటూరు జిల్లా:  08644 223800,-0863 2345103/ 0863 2234990  తెనాలి: 08644 223800
నెల్లూరు: 1800 425 2499, 08612 331477

Advertisement
Advertisement