సీమాంధ్ర నేతలు ఆటంకవాదులు: రాపోలు | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర నేతలు ఆటంకవాదులు: రాపోలు

Published Mon, Oct 21 2013 3:42 PM

సీమాంధ్ర నేతలు ఆటంకవాదులు: రాపోలు - Sakshi

హైదరాబాద్: ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 371(D) విభజనకు ఆటంకం కాదన్నారు. దాని వల్లే తెలంగాణకు తీరని నష్టం జరిగిందన్నారు. సీమాంధ్ర నేతలు కొందరు ఆటంకవాదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రాపోలు ఆనంద్‌భాస్కర్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నేడు సమావేశమయింది. రాష్ట్ర విభజనతో ముడిపడిన తెలంగాణ అంశాలపై జీవోఎంకు నివేదిక సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే ఏడాది మార్చినాటికి విభజన ప్రక్రియ పూర్తై రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయన్న నమ్మకాన్ని కాంగ్రెస్ నేతలు వెలిబుచ్చారు. జీవోఎంకు ఇచ్చే నివేదికపై తుది కసరత్తు కోసం ఈనెల 25 మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement