నర్సింగ్ విద్యార్థినిపై అఘాయిత్యం! | Sakshi
Sakshi News home page

నర్సింగ్ విద్యార్థినిపై అఘాయిత్యం!

Published Sun, Dec 22 2013 9:11 AM

Sexual harassment of nursing student in vizianagaram district hospital

నరరూప రాక్ష సుల కామవాంఛకు ‘నిర్భయ’ బలై ఏడాది గడిచింది. ఆ ఘటనకు నిరసనగా అప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. మహిళల రక్షణకు ‘నిర్భయ’లాంటి కఠిన చట్టాలు వచ్చాయి. అయినా అవి వారిపై దాడులను నిలువ రించలేకపోతున్నాయి. పనిచేసే స్థలాలు, జనసమ్మర్థమైన ప్రాంతాలు, చివరకు ఇళ్లలో కూడా మహిళలకు రక్షణ కరువవుతోంది. మృగాళ్లు... పిశాచాల్లా అవకాశం కోసం కాచుకుని కూర్చొని లైంగిక దాడులకు యత్నిస్తున్నారు. పట్టణంలో కేంద్రాస్పత్రిలో నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి ఒకరు యత్నించడం ఆస్పత్రి సిబ్బందిలో ఆందోళన రేకెత్తించింది.
 
 బరితెగించి...
 రోగులు, వైద్యులు, ఆస్పత్రిలో ఇతర ఉద్యోగులతో నిత్యం రద్దీగా ఉండే  కేంద్రాస్పత్రిలోని క్యాజువాలటీ విభాగంలో శిక్షణ పొందుతున్న నర్సింగ్ విద్యార్థినిపై ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి శనివారం లైంగిక దాడికి యత్నించాడు. విద్యార్థిని డ్రెస్సింగ్ మెటీరియ ల్ తేవడానికి క్యాజువాలిటీ పక్కన ఉన్న స్టోర్‌రూంకి వెళ్లింది. దీనిని గమనించిన ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంఎన్‌ఓ( మే ల్ నర్సింగ్ ఆర్డర్) రాము అనే వ్యక్తి ఆమెను వెంబడించి స్టోర్‌రూంలో గడియ పెట్టి లైంగిక దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా... సూపరింటెండెంట్ నాకు తెలుసని, నీకు ట్రైనింగ్ సర్టిఫకెట్ ఇవ్వకుండా చేస్తానని బెదిరించసాగాడు.
 
 ఊహించని పరిణామంతో తీవ్రం గా ఆందోళన చెందిన ఆమె పెద్దగా కేకలు వేసింది. తలుపు తీసుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. ఇది తెలుసుకున్న ఆస్పత్రి  సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. రెండు నెలల కింద ట  ఘోషా  ఆస్పత్రిలో ఓ సా్‌‌టఫ్ నర్సు పై ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది మరువక ముందే మరో వ్యక్తి బరితెగించడంతో మహిళా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
 
 రాజీకి యత్నాలు: బాధితురాలికి అండగా నిల వాల్సిన కొంతమంది సంఘం నాయకులు రాజీకి ప్రయత్నించారు. ఏదో అయిపోయింది , క్షమాపణ చెబుతాడు ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడితెచ్చారు. అయితే విద్యార్థి మాత్రం రాజీకి అంగీకరించలేదని తెలిసింది.
 
 ఘోషా ఆస్పత్రిలో...
 వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో తరచూ ఇటువంటి సంఘటనలు జరగుతున్నాయి. దీంతో నర్సులు, మహిళా ఉద్యోగులు, ఆస్పత్రి వచ్చే మహిళలు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలు క్రితం ఘోషా ఆస్పత్రిలో ఓ స్టాఫ్‌నర్స్‌పై ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని విధులు నుంచి తొలిగించారు. అయితే అతనిపై ఎటువంటి చర్య తీసుకోలేదు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement