ఉద్ధండ్రాయునిపాలెంలో మన మట్టికి షెడ్డు | Sakshi
Sakshi News home page

ఉద్ధండ్రాయునిపాలెంలో మన మట్టికి షెడ్డు

Published Mon, Oct 26 2015 8:53 AM

ఉద్ధండ్రాయునిపాలెంలో మన మట్టికి షెడ్డు - Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో: అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా రాష్ర్టంలోని 13 వేల గ్రామాల నుంచి సేకరించిన మన మట్టికి ఉద్ధండ్రాయునిపాలెంలో ఆదివారం షెడ్డు నిర్మించారు. వర్షం వస్తే మట్టి కరిగిపోకుండా ఈ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా యాగశాల, శంకుస్థాపన శిలాపలకం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అమరావతి గత వైభవాన్ని ప్రధానికి చూపించేందుకు ఏర్పాటు చేసిన అమరావతి గ్యాలరీని ప్రజల సందర్శనార్థం ఉంచారు.

మరోవైపు శంకుస్థాపన సభా ప్రాంగణానికి పోలీసు భద్రత కొనసాగుతూనే ఉంది. దాదాపు 20 రోజుల క్రితం నుంచి ఇక్కడ పోలీసు భద్రత నిరంతరంగా కొనసాగిస్తున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 22వ తేదీ జరిగింది. కార్యక్రమం పూర్తయి మూడు రోజులు గడిచినా బందోబస్తు మాత్రం కొనసాగిస్తున్నారు.
 

Advertisement
Advertisement