రాష్ట్రం నుంచి రాజ్యసభకు షీలా దీక్షిత్! | Sakshi
Sakshi News home page

రాష్ట్రం నుంచి రాజ్యసభకు షీలా దీక్షిత్!

Published Tue, Jan 21 2014 2:33 AM

రాష్ట్రం నుంచి రాజ్యసభకు షీలా దీక్షిత్! - Sakshi

 కాంగ్రెస్ హైకమాండ్ యోచన
 మళ్లీ పెద్దల సభ వైపు టీఎస్‌ఆర్ అడుగులు
 కొప్పుల రాజు,  ఎంఏ ఖాన్, కేవీపీలకు అవకాశం!


 సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆమెను  రాష్ట్రం నుంచి పోటీ చేయించే అవకాశాలను అధిష్టానం పరిశీలించినట్టుగా ఇక్కడి కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. అయితే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సమయంలో దీక్షిత్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారని తాము భావించడం లేదని పీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీ సూచించే స్థానిక నేతలకే ఓట్లు పడతాయో లేదో తెలియుని పరిస్థితిలో ఇతర రాష్ట్రాల వారిని పంపిస్తే వారిని గెలిపించుకోవడం కత్తిమీద సామేనని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఇలావుండగా విశాఖపట్నం లోక్‌సభ స్థానం కోసం ఇంతకాలం పట్టుబట్టిన టి.సుబ్బరామిరెడ్డి తాజాగా రాజ్యసభకు తన పేరును  పరిశీలించాలని కోరుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయుం వల్ల విశాఖలో లోక్‌సభకు పోటీచేసినా గెలవడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఆయున మరోసారి రాజ్యసభ సీటు అడుగుతున్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నారుు.

మొత్తం 6 స్థానాల్లో కాంగ్రెస్ మూడింటిని కచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉండగా, నాలుగో స్థానంపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌కు సాంకేతికంగా అసెంబ్లీలో 146 వుంది ఎమ్మెల్యేలున్నా వలసలతో ఆ సంఖ్య భారీగా కుదించుకుపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా కొప్పుల రాజు, ఎంఏ ఖాన్ పేర్లు ప్రవుుఖంగా వినిపిస్తున్నారుు. వూజీ ఐఏఎస్ అధికారి అరుున రాజు కాంగ్రెస్‌లో చేరి ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ టీమ్‌లో వుుఖ్యభూమిక పోషిస్తుండడంతో ఆయునకు సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పదవీ విరమణ చేస్తున్న కేవీపీ రావుచంద్రరావుకు కూడా రెండోసారి అవకాశం దక్కవచ్చని పార్టీలో వినిపిస్తోంది.

 ‘సీమాంధ్ర’ షాక్ తప్పదా!: రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానానికి షాకిచ్చే అంశంపై సీవూంధ్రకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవూలోచనలు జరిపారు. విభజన అంశంలో తవుకు వీసమెత్తు విలువ కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా వుుందుకు వెళ్తున్న పార్టీ పెద్దలకు గుణపాఠం నేర్పాలంటే ఇదే సరైన సవుయువుని వారు భావిస్తున్నారు. సోవువారం అసెంబ్లీ లాబీల్లో  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల వుధ్య ఈ ప్రస్తావన వచ్చింది. అక్కడినుంచి అది ఇతర జిల్లాల ఎమ్మెల్యేలకూ పాకింది. ఈ అసెంబ్లీ సమయంలో జరిగే చిట్టచివరి రాజ్యసభ ఎన్నికలు ఇవే కావడం, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఎమ్మెల్యేలు ఎవరూ అధిష్టానం వూట వినే పరిస్థితి ఉండదని రాయులసీవు వుంత్రి ఒకరు చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement