వణుకుతున్న విశాఖ మన్యం | Sakshi
Sakshi News home page

వణుకుతున్న విశాఖ మన్యం

Published Mon, Dec 19 2016 2:34 AM

వణుకుతున్న విశాఖ మన్యం - Sakshi

లంబసింగిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

చింతపల్లి: తుపాను ప్రభావంతో కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన చలి పులి మళ్లీ పంజా విసిరింది. విశాఖ జిల్లా ఏజెన్సీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో ఆదివారం 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం సాంకేతిక విభాగం అధికారి ప్రవీణ్‌ తెలిపారు. దీంతో  లంబసింగిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేశారు.

సాధారణంగా చింతపల్లి ఉష్ణోగ్రత కన్నా లంబసింగిలో 3 డిగ్రీలు తక్కువ ఉంటుంది. చింతపల్లిలో శనివారం 8 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత ఆదివారానికి 5 డిగ్రీలకు పడిపోవడంతో గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. లంబసింగిలో ఉదయం 11 గంటల వరకు మంచు దట్టంగా కురిసింది. దీంతో స్థానికులు మిట్ట మధ్యాహ్నం కూడా ఉన్ని దుస్తులు ధరించుకుని తిరగాల్సి వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement