పలమనేరు: రెండు నెలలుగా జిల్లాలో సాగుతున్న బియ్యం అక్రమ రవాణా గట్టును పలమనేరు పోలీసులు విప్పారు. శ్రీకాళహస్తి కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సాగుతున్నట్లు విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఏడుగురు స్మగ్లర్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేట్‌కు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను పలమనేరు సీఐ బాలయ్య విలేకరులకు వివరించారు.
ఈ నెల 12న ‘నల్లబజారుకు తెల్లబియ్యం’ శీర్షికన సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైన విషయం తెల్సిందే. దీనిపై ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ స్పందిం చారు. జిల్లాలోని పోలీసులను అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పలమనేరు పోలీసులు పట్టణంలోని అపోలో ఫార్మసి ఎదురుగా ఓ బియ్యం లారీని పట్టుకున్నారు. ఆ లారీ డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతనిచ్చిన సమాచారంతో తీగ లాగితే డొంక కదిలింది.
శ్రీకాళహస్తి నుంచే రవాణా..
శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు వ్యక్తులతో పాటు వి.కోటకు చెందిన ఒకరు తమిళనాడు బియ్యంతో పాటు జిల్లా నుంచి అందే బియ్యాన్ని డంప్‌చేసి బంగారుపేట్‌కు తరలించేవారు. పక్కా సమాచారం తో పలమనేరు పోలీసులు పెద్దిరాజు (36), బాలాజీ (36), తాజుద్దీన్ (32), పఠాన్‌బాబు (39), బాలమురుగన్ అలియాస్ బాల (20), వినోద్‌ను పట్టుకున్నారు. వీరందరూ శ్రీకాళహస్తికి చెందిన వారే.
జీడీ నెల్లూరు మండలం ఎట్టేరికి చెందిన పెద్దిరాజు శ్రీకాళహస్తి కేంద్రంగా ఈ ముఠాకు బాస్. వీరితో పాటు వి.కోటకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఆండియప్పన్ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై తమిళనాడు రాష్ర్టంలోనూ పలు కేసులున్నాయి. ఆండియప్పన్పై తమిళనాడు ప్రభుత్వం అవార్డును సైతం ప్రకటించింది. వీరందరిపై కేసులు నమోదుచేసి పలమనేరు కోర్టుకు తరలించారు.
బియ్యం ఎలా సేకరిస్తారంటే..
శ్రీకాళహస్తి కేంద్రంగా బియ్యాన్ని కర్ణాటకకు తరలించేది పెద్దిరాజు ముఠా. తమిళనాడుకు చెందిన భాస్కర్‌రెడ్డి, హరినాథరెడ్డి, ప్రభాకర్, ధన్‌రాజ్ తమిళనాడులో బియ్యాన్ని సేకరించి నెల్లూరు జిల్లాలోని తడ వద్దకు చేరుస్తారు. అలాగే చిత్తూరు జిల్లాలో సేకరించిన బియ్యాన్ని పలుచోట్ల డంప్లుగాచేసి ఈ రెండింటినీ కలిపి పెద్దిరాజు గ్యాంగ్‌కు విక్రయిస్తారు.
ఈ బియ్యమంతా బంగారుపేట్కే
తమిళనాడు రాష్ర్టంలో భాస్కర్‌రెడ్డి గ్యాంగ్ అక్కడి బియ్యాన్ని చౌకగా కొనుగోలు చేసి ఇక్కడి స్మగ్లర్లకు రూ.10 లెక్కన విక్రయిస్తుంది. వీరు ఈ బియ్యాన్ని జిల్లాలో దొరికే చౌకబియ్యంతో కలిపి కర్ణాటకలోని బంగారుపేటలో పాలిషింగ్ యాజమానులు బాయ్, మురుగన్‌లకు రూ.15 నుంచి 20లకు విక్రయిస్తారు. ఆ బియ్యాన్ని కిలో రూ.30 దాకా ప్రజలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఈ ముఠాకు పలమనేరు పోలీసులు చెక్ పెట్టారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ శ్రీరాముడు, సిబ్బంది దేవరాజులును సీఐ అభినందించారు.
బియ్యం స్మగ్లర్ల గుట్టురట్టు
Published Thu, Oct 16 2014 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement