రాజకీయ సంక్షోభంతోనే ‘సమైక్యం’ | Sakshi
Sakshi News home page

రాజకీయ సంక్షోభంతోనే ‘సమైక్యం’

Published Sun, Sep 15 2013 1:37 AM

Simandhraloni ministers, MPs resigned their positions, and the political crisis of the state Division

బొబ్బిలి, న్యూస్‌లైన్ :    సీమాంధ్రలోని మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే రాష్ట్ర విభజన నిర్ణయం ఆగుతుందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జి ల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్ కృష్ణ రం గారావు అన్నారు. మంత్రులు, ఎంపీలు ప్రజ లు, ఉద్యోగుల ఒత్తిడికి లొంగకపోతే వైఎస్సా ర్ సీపీ ముందుండి మెడలు వంచైనా వారితో రాజీనామా చేయిస్తుందని తెలిపారు. శనివా రం ఆయన తన జన్మదినం సందర్భంగా కోర్టు సమీపంలోని పాత పెట్రోల్ బంకు ఆవరణలో  సమైక్యాంధ్రాకు మద్దతుగా ఒక రోజు నిరాహా ర దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు మాజీ ఎంపీపీలు కురమాన రాయప్ప, గర్బా పు పరశురాం జేఏసీల సమక్షంలో సుజయ్‌కు నిమ్మరసం వచ్చి దీక్షను విరమింపచేశారు.
 
 ఈ సందర్భంగా సుజయ్ మాట్లాడుతూ మంత్రు లు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని ఓ రాజకీయ పార్టీగా ఒత్తిడి తేవడం సరైనది కాక పోయినా ఉద్యోగులు, ప్రజల వల్ల అదిసా ధ్యం కాకపోతే వైఎస్సార్ సీపీ రంగంలోకి దిగుతుందన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడితేనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన మారుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకు న్న ప్రణాళిక ప్రకారం రాష్ట్ర విభజన ప్రక్రియ ను వేగవంతం చేస్తుందని, అందుకు ధీటుగా ఉద్యమాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలను ముట్టడిం చి, వారు రాజీనామాలు చేసేలా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ చీఫ్ బొత్స ప్రజల మధ్యకు రాకుండా హైదరాబాద్, ఢిల్లీలో చక్క ర్లు కొడుతున్నారన్నారు. అటువంటి వారి కి ప్రజల్లో స్థానం ఉండదని స్పష్టంగా తెలి యాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేం దుకు వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకుందన్నారు.
 
పుట్టినరోజు వేడుకలకు దూరంగా సుజయ్
రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సుజయ్ కృష్ణ రంగారావు తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. బొబ్బిలి రాజుల పుట్టిన రోజు వేడుకంటే కోటతో పాటు బొబ్బిలి పట్టణమంతా సంబరంగా ఉంటుంది. అభిమాను లు.. కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో కిటకిటలాడుతుంది. కానీ శనివారం ఆ పరిస్థితి ఎక్కడా కానరాలేదు. దీక్షా శిబిరానికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు బొబ్బిలి ని యోజకవర్గంలోని జేఏసీల నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శిబిరం వద్ద ప్రముఖుల చిత్రాలను ఉంచారు. రాష్ర్ట విభ జనకు టీడీపీ ఇచ్చిన లేఖ, విభజనపై వైఎ స్సార్ సీపీ స్పందించిన తీరును ఫెక్సీలలో వివరించారు. దీక్షకు ముందు సుజయ్ వాటిని పరి శీలించి, నిర్వాహకులు చెలికానిమురళీకృష్ణ, గంగుల మదన్‌మోహన్, గునాన వెంకటరావును అభినందించారు. దీక్షా శిబిరం సమీపంలో బొబ్బిలి రాజుల ఆధ్వర్యంలో శాంతి హోమం జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో వైఎ స్సార్ సీపీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబ శివరాజు,అరుకు పార్లమెంట్ పరిశీలకుడు ఆర్‌వీఎస్‌కేకే రంగారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు తూముల రాంసుధీర్,  ఎస్. కోట, గజపతినగరం, పార్వతీపురం, చీపురుపల్లి, సాలూరు, విజయనగరం నియోజకవర్గాల ఇన్‌చార్జిలు బోకం శ్రీనివాస్,     మక్కువ శ్రీధర్, డాక్టర్ పెద్దినాయుడు, కొయ్యాన శ్రీవా ణి, జమ్మాన ప్రసన్నకుమార్, ఉదయభాను, బొత్స కాశి నాయుడు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కోట్ల సూర్యనారాయణ, తుమ్మగంటి సూర్యనారాయణ, ప్రశాంత్‌కుమార్, ము న్సిపల్ మాజీ చైర్మన్ ముగడ గంగమ్మ, గొర్లె వెంకటరమణ, ఆదాడ మోహనరావు, రాయ లు, తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement