ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

11 Jul, 2015 15:35 IST|Sakshi
ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

గుంటూరు : ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి నుజ్జునుజ్జయింది. దీంతో క్యాబిన్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఈపూర్ మండలం కొండ్రముట్ల గ్రామ సమీపంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా ఈపూర్ నుంచి ప్రకాశం జిల్లా వాదంపల్లి గ్రామానికి ఎరువుల లోడుతో వెళ్తున్న లారీ.. వినుకొండ నుంచి వడ్డెంగుంట వైపు వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి కొండ్రముట్ల మలుపు వద్దరోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది.

దీంతో లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. క్యాబిన్‌లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలొదలగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మువ్వా మంగమ్మ(47) కూడా తీవ్రంగా గాయపడింది. ఆమెను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వినుకొండ, గుంటూరు ఆస్పత్రులకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు