నెల్లూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ | Sakshi
Sakshi News home page

నెల్లూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Published Fri, Jun 19 2015 3:25 PM

నెల్లూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - Sakshi


నెల్లూరు : రహదారులపై దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు జిల్లా వరదయ్యపాలెం వద్ద పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు లారీలతోపాటు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు వాహనాలను చోరీ చేసి దొంగ పత్రాలతో విక్రయిస్తుంటారని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ శుక్రవారం నెల్లూరులో మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement