Sakshi News home page

జల మార్గానికి పోల‘వరం’

Published Tue, Jul 8 2014 2:16 AM

some government companies do survey on godavari for jal marg

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ బ తుకులు ఛిద్రం అవుతాయని ఆందోళన చెం దుతున్న ముంపు ప్రాంతాల ప్రజలకు అలాం టి బెంగ అవసరం లేదని.. ప్రాజెక్ట్ నిర్మిస్తే అక్కడి వారికి ప్రయోజనాలు చేకూరతాయని ప్రభుత్వరంగ సంస్థలు తేల్చారుు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తరుుతే.. ఆదివాసీలకు.. ముం పు ప్రాంతాల్లోని ప్రజలకు వృత్తి, వ్యాపా రం, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయ ని స్పష్టం చేస్తున్నారుు. అక్కడి ప్రజల జీవితా ల్లో వెలుగులు నిండుతాయని నిగ్గుతేల్చారుు.
 
 కుక్కునూరు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి పై ఏర్పడే జలమార్గం వల్ల ముంపు ప్రాంతాల ప్రజలకు ప్ర యోజనాలు ఉన్నాయని ప్రభుత్వ రంగ సంస్థలు చెబుతున్నారుు. ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి రాజ మండ్రితోపాటు వివిధ పట్టణాలకు వెళ్లే దూరం తగ్గుతుందని పేర్కొంటున్నారుు. గత ఏడాది నోయిడాలోని ప్రభుత్వరంగ సంస్థ అరుున ఐడబ్ల్యూఏఐ (ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా),  హైదరాబద్‌కు చెందిన ఐఐసీ (ఇంటలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కన్వర్షన్) సంస్థలు గోదావరిపై సర్వే నిర్వహించాయి. వరదల సమయంలో తప్ప గోదావరిలో నీటిమట్టం తక్కువగా  ఉంటుందని, నీటిలోతు వందమీటర్లు ఉంటేనే లాంచీ ప్రయా ణం సాధ్యమవుతుందని తేల్చారుు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే నదిలో నీటిలోతు పెరుగుతుందని, దానివల్ల జల రవాణా సాధ్యమవుతుందని స్పష్టం చేశారుు.
 
 రోడ్డు, రైలు మార్గంతో పోలిస్తే జల మార్గం ద్వారా రాజమండ్రికి వెళ్లే ప్రయూణికులు, యాత్రికులకు దూ రం, ఖర్చు, సమయం తగ్గుతాయి. భద్రాచలం, రాజమండ్రి మధ్యలో ఉన్న పేరంటాలపల్లి, పాపికొండలు వంటి పర్యాటక ప్రాంతాలను చూసే వీలు కలుగుతుంది. భద్రాచలం బ్రిడ్జి నుంచి రాజమండ్రి కాటన్ బ్యారేజీ వరకు గోదావరి నది పొడవు 157 కిలోమీటర్లు ఉండగా.. నది ఒడ్డు 171 కిలోమీటర్లు ఉందని సర్వే సంస్థలు నిర్థారించాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని పోచవరం, పాపికొండలు వద్ద 59 మీటర్లు, కచ్చులూరు వద్ద గోదావరిలో 60 మీటర్లు నీటిలోతు ఉండగా, కుక్కునూరు మండల పరిధిలోని వింజరం రేవులో  ఆరు మీటర్లే లోతు ఉందని  గుర్తించారుు.
 
పోలవరం ప్రాజెక్టు పూర్తరుుతే నీటిలోతు సుమారు వందమీటర్లు ఉండవచ్చని సర్వే అధికారులు అంచనా వేశారు. భద్రాచలం నుంచి చింతూరు మీదుగా రాజమండ్రికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 209 కిలోమీటర్ల దూరం ప్రయూణించాలి. భద్రాచలం నుంచి కుక్కునూరు మీదుగా రాజమండ్రికి 185 కిలోమీటర్ల దూరం ఉంది. జలమార్గం ద్వారా ఆ దూరం 157 కిలోమీటర్లకు తగ్గుతుంది. రాజ మండ్రి, కాకినాడ వెళ్లే ప్రయాణికులకు సమయం, ఖర్చు, దూరం కలసి వసా ్తరుు. జలరవాణా వ్యవస్థ ఏర్పాటైతే ముంపు మండలాలు అభివృద్ధి చెందుతారుు. ప్రజలకు ఉపాధి లభిస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement