ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

Published Sun, Jun 7 2015 8:23 AM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్-పాట్నా(07091/07092) తత్కాల్ సూపర్‌ఫాస్ట్ ట్రైన్ ఈ నెల 19, 26 తేదీల్లో ఉదయం 8.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.10కి పాట్నా చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ నెల 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 1.30కు పాట్నా నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుపతి -సికింద్రాబాద్(07430)రైలు జూన్ 7 సాయంత్రం 3.44 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-తిరుపతి (07429) తత్కాల్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 9న సాయంత్రం 7.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30కు తిరుపతికి చేరుకుంటుంది.
 

Advertisement
Advertisement