గిరిజనాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక | Sakshi
Sakshi News home page

గిరిజనాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

Published Mon, Jan 27 2014 3:48 AM

special plan to tribal development

భద్రాచలం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఐటీ డీఏ ప్రాజెక్టు అధికారి జి. వీరపాండియన్ చెప్పారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆదివారం ఐటీడీఏ ప్రాంగణంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఏజెన్సీ పరిధిలో 522 విద్యా సంస్థల ద్వారా ప్రతి ఏటా 50 వేలకు పైగా గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  

చదువు మధ్యలోనే మానేసిన వారికి ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు కొండరెడ్డి విద్యార్థుల కోసం మైత్రి క్యాంపు పేరుతో ప్రత్యేక పాఠశాల నిర్విహ స్తున్నట్లు చెప్పారు. 29 మండలాల్లో ఉన్న 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గిరిజన రోగుల ఆరోగ్యపరమైన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 297 మంది ఏఎన్‌ఎంలు, 41 మంది వైద్యులకు సెల్‌ఫోన్‌లను అందజేసినట్లు  చెప్పా రు. మార్పు పథకంలో భాగంగా ప్రతీ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి రూ.5 లక్షల చొప్పున మెరుగైన వసతుల కల్పన కోసం మంజూరు చేసినట్లు తెలిపారు.

అంతేకాకుం డా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పా టు చేసి మాతా-శిశు సంరక్షణకు పాటుపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8,744 మంది గిరిజన లబ్ధిదారులకు మేలు చేకూరే విధంగా రూ.17.01 కోట్లు సబ్సిడీని అందజేసేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. వ్యవసాయాభివృద్ధికి 37 గ్రామ సమాఖ్యలకు 35ట్రాక్టర్‌లను అందజేశామన్నారు. కొండరెడ్ల అభి వృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. 4 గ్రామాలను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు సీసీడీపీ నిధుల కింద రూ.1.72 కోట్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు. చింతూరు, వీఆర్‌పురం గ్రామాల్లో వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు సింగరేణి సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.  తాగునీటి సమస్య నివారణకు రూ.3.31 కోట్లతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

 ఏజెన్సీ పరిధిలో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఏడు ఇసుక రీచ్‌లను గిరిజన మహిళా సొసైటీలకు అప్పగించటం ద్వారా రూ.18.83 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గతంలో జరిగిన లోపాలను పూర్తి స్థాయిలో సమీక్షించిన మేరకు ఈ సారి వీటి నిర్వహణలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, ఆయా మండల ఎంపీడీవోలకు దీనిపై బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

 గిరిజన ఉప ప్రణాళిక పై ప్రత్యేక దృష్టి...
 ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గిరిజన ఉప ప్రణాళికపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పీవో తెలిపారు. ఈ పథకం ద్వారా మంజూరైన రూ.189.36 కోట్లతో వివిధ శాఖల ద్వారా 1,271 అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్‌డబ్ల్యూఈఏ కింద మంజూరైన రూ.85 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అటవీ హక్కుల చట్టం ద్వారా భద్రాచలం ఏజెన్సీలో ఇప్పటి వరకూ 2,05,705 ఎకరాలకు సంబంధించి అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఏజెన్సీలో మహిళా స మాఖ్యల అభివృద్ధి కోసం ఐకేపీ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సం క్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు, సి బ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్ధులు చేసిన సాంస్కృతిక కార్యక్ర మాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో తగు సేవలు అందించిన వారికి ఈ సందర్భంగా పీవో ప్రశంసా పత్రాలను అందజేశారు. కా ర్యక్రమంలో ఏపీవో శ్రీనివాస్, ఐటీడీఏ మేనేజర్ భీమ్‌రావ్, కొండరెడ్ల ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి, ఐకేపీ ఏపీడీ జయశ్రీ, గణాంకపు అధికారి చంద్రిక, జీసీసీ డీఎం వీరస్వామి, పబ్లిసిటీ విభాగం ఏపీవో మహ్మద్ మూర్తజా , అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పుల్లయ్య, ఇంజనీరింగ్ ఈఈ శంకర్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement