గౌహతికి ప్రత్యేక రైలు | Sakshi
Sakshi News home page

గౌహతికి ప్రత్యేక రైలు

Published Tue, May 20 2014 12:42 AM

గౌహతికి ప్రత్యేక రైలు - Sakshi

విశాఖ మీదుగా ప్రయాణం
 
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ మీదుగా సికింద్రాబాద్ నుంచి గౌహతికి ఓ ప్రత్యేక సర్వీసు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు ట్రిప్పులు మాత్రమే నడిచే ఈ ప్రత్యేక రైలు మే 30, జూన్ 6న (ప్రతి శుక్రవారం) నడపనున్నారు. ఒక సెకండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ, 5 స్లీపర్ క్లాస్, మూడు జనరల్ చైర్‌కార్ బోగీలు, నాలుగు జనరల్ బోగీలు, రెండు లగేజీ కం జనరల్ ప్రయాణికుల బోగీలుంటాయని ప్రకటించారు.

న్యూ జల్పాయ్‌గురి, కిషన్ గంజ్, హౌరా, ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, బరంపురం, పలాస, విజయనగరం, విశాఖ, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, న ల్గొండ స్టేషన్‌ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
 
07249 నంబరు గల సికింద్రాబాద్-గౌహతి ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 30, జూన్6 తేదీల్లో ప్రతి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి అదే రోజు రాత్రి 8 గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖలో 8.20 గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 7.55 గంటలకు గౌహతి వెళ్తుంది.
 
07250 నంబరు గల గౌహతి-సికింద్రాబాద్ ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జూన్ 2, 9 తే దీల్లో ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు గౌహతిలో బయల్దేరి మంగళవారం రాత్రి 7.40 గంటలకు విశాఖ చేరుతుంది. విశాఖలో తిరిగి 8 గంటలకు బయల్దేరి బుధవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ వెళ్తుంది.
 

Advertisement
Advertisement