రాజమహేంద్రవరం క్రైం : కళాశాల విద్యార్థినును లైంగికంగా వేధిస్తున్న కామాంధుడు గుత్తుల రాజేష్ ను టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్దగల చైతన్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ కరస్పాండెంట్ గుత్తుల శ్రీధర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్ విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలలో ఉన్నట్టు వదంతులు వచ్చాయి. ఎట్టకేలకు టూ టౌన్ పోలీసులు శ్రీధర్‌ను ఇన్నీసుపేటలోని అతని ఇంటివద్దే శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టు సీఐ కె. నాగేశ్వరరావు శనివారం తెలిపారు. నిందితుడు నేరం అంగీకరించాడని, అతనిపై నిర్భయ యాక్ట్, సెక్షన్ 376, ఐటీ 67, చీటింగ్ కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు. ఇంటరాగేషన్ అనంతరం అతనిని రిమాండ్‌కోసం కోర్టుకు తరలించామన్నారు.