ఉగాదికి ముందే పంచాంగం | Sakshi
Sakshi News home page

14 నుంచి శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాలు

Published Fri, Feb 7 2020 10:08 AM

Srinivasa Mangapuram Brahmotsavam Starts From February 14th 2020 - Sakshi

సాక్షి, తిరుమల: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో కొలువుదీరిన కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 11, 25 తేదీల్లో వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.

ఈ నెల 12, 26వ తేదీల్లో 5 సంవత్సరాల్లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనానికి అనుమతి కల్పిస్తాని పేర్కొన్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సేవా టిక్కెట్లు పొందాలని సూచించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో టికెట్లు లేనట్లయితే ఇతర సైట్లలో ఉన్న టికెట్లు నకిలీవిగా భావించాలని తెలిపారు హెచ్చరించారు. ఇక నకిలీ వెబ్‌సైట్లు నిర్వహిస్తున్న 19 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. కాగా తెలుగు పండుగ ఉగాదిని పురస్కరించుకుని మార్చి మొదటి వారంలోనే భక్తులకు పంచాగాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement